Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయాన్ని అందుకునం బాలయ్య.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK 109 చేస్తున్నాడు. ఈ ఏడాదే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా .. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈసినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోను కూడా తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బాబీ.. దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా చిరుతో పాటు రవితేజ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్నిఅందుకుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని సోషల్మీడియా లో టాక్ నడుస్తోంది.
Mega 157: చిరంజీవి 157 సినిమా.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్
ఇక దుల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా దుల్కర్ దిగనంత వరకే. ప్రస్తుతం భాషతో పనిలేకుండా అన్ని ఇండస్ట్రీలను దుల్కర్ ఏలేస్తున్నాడు. ఇప్పటికే వరుస సినిమాలతో దుల్కర్ బిజీగా ఉన్నాడు. కథ చెప్పడానికి ఇప్పటికే బాబీ.. దుల్కర్ ను కలవడం.. కథ నచ్చడంతో ఆయన ఓకే చెప్పడం కూడా జరిగాయని టాక్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. సినిమాపై మరిన్ని అంచనాలను పెరిగే అవకాశం ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.