సెకండ్ ఇన్నింగ్స్‌లో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నాడు. అంతేకాదు వరుసగా హిట్స్, భారీ హిట్స్ కొడుతూ.. ప్రజెంట్ జనరేషన్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే ఈ ఏడాది వచ్చిన బోళా శంకర్ మాత్రం మెగా ఫ్యాన్స్‌ని, ఆడియన్స్‌ని దారుణంగా నిరాశ పరిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ అనంతరం కాస్తా బ్రేక్ తీసుకున్న చిరు తన 156 ప్రాజెక్ట్‌కి రెడీ అయ్యాడు. ఈ మూవీ యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ మూవీ ఆఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.
Also Read: Black Apples : అరుదైన బ్లాక్ డైమండ్ యాపిల్స్.. ధర ఎంతో తెలుసా?
బింబిసార మూవీతో డైరెక్టర్ పరిచయమై వశిష్ట ఫస్ట్ మూవీతోనే బ్లక్‌బస్టర్ అందుకున్నాడు. దీంతో తన నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అది కూడా మెగాస్టార్ మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టెషన్స్ పెరిగిపోయాయి. దానిని మరింత రెట్టింపు చేసేలా డైరెక్టర్ వశిష్ట ఈ మూవీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన అతడు చిరంజీవి 156 మూవీ గురించిన విశేషాలను పంచుకున్నాడు. వశిష్ఠ మాట్లాడుతూ.. చిరంజీవి గారి జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీ చూసి సర్‌ప్రైజ్ అయ్యానని చెప్పారు.
Also Read: Mangalavaaram: ఒక హీరోను భలే దాచారు మావా!
అయితే ‘అలాంటి సినిమా మళ్లీ చిరంజీవి గారి నుంచి రాలేదు. అంజి సినిమా వచ్చినా కూడా అది పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ మూవీ కాదు. అందుకే చిరంజీవి కోసం అలాంటి జానరే రెడీ చేశారు. ఈ సినిమాను చాలా శ్రద్ద పెట్టి చేస్తున్నా. ఇందులో డెబ్భై శాతానికి పైగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సినిమా ప్రేక్షకులను, అభిమానులను తప్పకుండా ఆకట్టుకుంటుందనే అనుకుంఉటన్నా’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సినీ ప్రియులంతా ఇప్పుడు చిరంజీవి 156 గురించే మాట్లాడుకుంటున్నారు. కాగా ప్రస్తుతం శరవేంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది.