Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్

Dulquer Salmaan

Dulquer Salmaan

టాలీవుడ్, కోలీవుడ్‌ మార్కెట్ పెంచుకునేందుకు మాలీవుడ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చాడు దుల్కర్ సల్మాన్. ఓన్ ఇండస్ట్రీని ఎవైడ్ చేస్తే అసలుకే మోసం వస్తుందని త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకుని ఐయామ్ గేమ్‌తో హాయ్ చెప్పాడు. సినిమా ఘోర పరాజయం పాలైంది. పలు చోట్ల షోలు రద్దు కావడం, కంటెంట్ లోపం పట్ల మూవీ లవర్స్, దుల్కర్ ఫ్యాన్స్ గట్టిగా హర్ట్ అయ్యారు. దీంతో నెటిజన్స్.. ఐయామ్ గేమ్ వైఫల్యానికి దుల్కర్ అండ్ అతడి నిర్మాణ సంస్థ వేఫారర్ కారణమంటూ ట్రోల్ చేశారు.

నిర్మాణ సంస్థ అండ్ తనపై జరిగిన ట్రోలింగ్ పై ఎట్టకేలకు దుల్కర్ సల్మాన్ స్పందించాడు. మీ విమర్శల్లో నిజాయితీ ఉందన్న హీరో.. అన్ని సరిగ్గా చేసినప్పటికీ.. కొన్ని సార్లు పరిస్థితులు తారుమారు అవుతాయంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఒక సినిమా రిజల్ట్ అంచనా వేయడం ఈజీనే అని.. తెర వెనుక ఎంతో మంది కష్టం ఉంటుందని, ఓ సినిమా తయారు కావడం అంత సులభమేమీ కాదన్నాడు. ఏదీ ఏమైనా మిస్టేక్స్‌కు తనే బాధ్యత తీసుకుంటున్నాని హూందాగా సమాధానం ఇచ్చాడు. ట్విట్టర్‌లో అదీ కూడా సినిమా రిలీజైన నెల తర్వాత హీరో రిప్లై ఇవ్వడం చూసి హ్యాపీ ఫీలౌతున్నారు ఫ్యాన్స్. నెక్ట్స్ మూవీతో గట్టిగా కొట్టాలని దుల్కర్‌కు సపోర్ట్ చేస్తున్నారు ఇంకొందరు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ తర్వాత హిట్ చూడలేదు. కాంత, ఐయామ్ గేమ్ డిజాస్టర్స్ అయ్యాయి. నెక్ట్స్ తెలుగు మూవీ ఆకాశంలో ఓ తారతో పలకరించబోతున్నాడు. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఫిల్మ్. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఫ్లాప్ చూడలేదు దుల్కర్. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ హిట్స్‌గా నిలిచాయి. ఆకాశంలో ఓ తారతో సక్సెస్ కొట్టి.. తెలుగులో తనకు తిరుగులేదని మరోసారి ఫ్రూవ్ చేసుకుంటాడా చూడాలి.