Site icon NTV Telugu

బ్రేకింగ్: ‘పుష్ప’ ట్రైలర్ వాయిదా..

pushpa

pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప ది రైజ్’.. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. విలన్ గా మలయాళ స్పెర్ స్టార్ ఫహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని ఈ సినిమాపై భారీ అంచలనాలను రేకెత్తిస్తున్నాయి.

పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ట్రైలర్ ని డిసెంబర్ 6 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అందరు ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న క్షణంలో మేకర్స్ షాక్ ఇచ్చారు .. కొన్ని టెక్నీకల్ ఇష్యూస్ వలన ట్రైలర్ వాయిదా పడుతున్నట్లు తెలిపారు. ట్రైలర్ రిలీజ్ చేయడం ఆలస్యమైనందుకు క్షమాపణలు కోరిన మేకర్స్ త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ మైత్రీ మూవీ మేకర్స్ పై మండిపడుతున్నారు. అయితే వాయిదా పడింది అని చెప్పిన చిత్రబృందం మళ్లీ రిలీజ్ ఎప్పుడు చేస్తారో చెప్పకపోయేసరికి ఇంకా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. మరి ఈ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Exit mobile version