NTV Telugu Site icon

The Warrior : “బుల్లెట్” సాంగ్ పై రాక్ స్టార్ ఫస్ట్ రివ్యూ

The Warrior

The Warrior

తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “ది వారియర్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా, తాజాగా ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరో శింబు పాట పాడిన విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పాటకు సంబంధించిన టీజర్ ఒకటి విడుదల కాబోతోంది అంటూ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్న దేవిశ్రీప్రసాద్ ట్వీట్ చేశారు.

Read Also : Dil Raju : మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ ప్రొడ్యూసర్… ఇదుగో సాక్ష్యం !

శింబు మీరు ఈ పాటను తెలుగు, తమిళం రెండిటిలోనూ ఇరగదీశారు… థాంక్స్ అంటూ దేవి శ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఈ పాటకు సంబంధించిన టీజర్ 20వ తేదీన విడుదల చేస్తున్నామని దేవిశ్రీప్రసాద్ చెప్పుకొచ్చారు. శింబు గతంలో పాడిన తెలుగు పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి తమిళ స్టార్ పాడిన ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సాంగ్ కు “బుల్లెట్” అని టైటిల్ పెట్టారు.

Show comments