కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇటీవలే ‘సుడల్’ వెబ్ సిరీస్ తో అందరిని మెప్పించిన ఐశ్వర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రైవర్ జమున’. పి. క్లిన్ సిన్ దర్శహకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో 18 రీల్స్ బ్యానర్ పై ఎస్పీ చౌదరీ నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ట్రైలర్ ఆదాయన్తం ఉత్కంఠభరితంగా కనిపిస్తోంది. ఇంట్లో పెద్దవాళ్ళ మాట కాదని జమున(ఐశ్వర్య రాజేష్) క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఇక మరోపక్క ఒక రౌడీ బ్యాచ్ ఒక రాజకీయ నేతను హత్య చేయడానికి పథకం వేస్తారు.
అనుకోకుండా ఆ రౌడీ బ్యాచ్.. జమున క్యాబ్ లో ఎక్కుతారు.. 90 నిమిషాల ఆ ప్రయాణంలో జమున ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది..? ఆ హత్య కేసు నుంచి జమున ఎలా బయటపడింది..? రాజకీయ నేతను కాపాడడానికి ఆమె ఏమేమి ప్రయత్నాలు చేసింది..? అనేది కథగా తెలుస్తోంది. ట్రైలర్ మొత్తం చాలా ఉత్కంఠభరితంగా కట్ చేశారు. క్యాబ్ డ్రైవర్ గా ఐశ్వర్య నటన అద్భుతమని చెప్పాలి. ఇక సినిమాకు హైలైట్ గా నిలిచింది జిబ్రాన్ మ్యూజిక్.. ఇక ఈ ట్రైలర్ తోనే సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.. మరి ఈ సినిమాతో ఐశ్వర్య రాజేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.