Double Ismart: ఉస్తాద్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ షురూ అయ్యింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లైగర్ రిజల్ట్ నుంచి బయటకి వచ్చి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మళ్లీ తన మార్క్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. పూరి అంటే ఎగిసిపడే అలలాంటి వాడు. ఎంత స్పీడ్‌గా కిందకి పడిపోతాడో.. అంతకుమంచి డబుల్ ఫోర్స్‌తో పైకి వస్తాడు. అందుకే ఈసారి డబుల్ ఇస్మార్ట్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అది కూడా తన ఫార్మాట్‌లోనే రాబోతున్నాడు. లైగర్ కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించిన పూరి.. ఇప్పుడు సంవత్సరం లోపే సినిమా కంప్లీట్ చేసి ఆడియెన్స్ ముందుకి తీసుకురాబోతున్నాడు. ఇటీవలె ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అది కూడా రిలీజ్ డేట్‌తో సహా ప్రకటించాడు.
వచ్చే మార్చి 8న డబుల్ ఇస్మార్ట్‌ను రిలీజ్ చేయనున్నట్టు.. అనౌన్స్మెంట్ రోజే చెప్పేశాడు. దీంతో ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ ని చూడడానికి రామ్ పోతినేని ఫాన్స్ కూడా రెడీ అయ్యారు. పది రెడ్ బుల్స్ తాగిన ఎనర్జీని ఒక్క సినిమాతో ఇవ్వడానికి ప్రిపేర్ అవుతన్న ఈ కాంబినేషన్ ఎట్టకేలకు సినిమా లాంచ్ చేసింది. పూజా కార్యక్రమాల్ని పూర్తి చేసి జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తున్నట్టు చెప్పేసారు. జులైలో లాంఛనంగా మొదలుపెట్టి, ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడట పూరి. ఆ తర్వాత రెండు, మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని.. ఎట్టి పరిస్థితుల్లోను మార్చ్ 8న చెప్పిన డేట్ డబుల్ ఇస్మార్ట్ ని రిలీజ్ చేసేయాలని పూరి ప్లాన్ చేసాడని సమాచారం. ప్రస్తుతం రామ్, బోయపాటి శ్రీనుతో కలిసి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’ చేస్తున్నాడు. సెప్టెంబర్ 15న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ‘స్కంద’ పాన్ ఇండియా సినిమా కాబట్టి అది హిట్ అయితే డబుల్ ఇస్మార్ట్ కి మరింత మార్కెట్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ. ఈ మరి డబుల్ ఇస్మార్ట్‌తో పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
With the blessings of Lord Shiva 🔱
Ustaad @ramsayz & Dashing Director #PuriJagannadh's#DoubleISMART Pooja ceremony commenced 🪔
Shoot Begins on July 12th❤️🔥
Mass Action Entertainer at the cinemas on MARCH 8th, 2024💥@Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/Kj9vDRHiIg
— Puri Connects (@PuriConnects) July 10, 2023
తాజావార్తలు
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!