Back-to-Back Surprises : ఎన్టీఆర్ – చరణ్ సమ్మర్ హీట్ పెంచేశారుగా

Ntr ramCharan

Ntr ramCharan

టాలీవుడ్ ఇద్దరు దిగ్గజ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు మే మూడవ వారం అసలైన పండుగను తీసుకురాబోతోంది. కేవలం ఒక్క రోజు వ్యవధిలో చరణ్ ‘మాస్ వైబ్స్’, ఎన్టీఆర్ ‘మ్యాడ్నెస్’ సోషల్ మీడియాను షేక్ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ బ్యాక్-టు-బ్యాక్ అప్‌డేట్స్‌తో మ్యూచువల్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఖాయంగా కనిపిస్తోంది.బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ట్రైలర్‌లో రామ్ చరణ్ ఊర మాస్ లుక్ మరియు పవర్‌ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నాయి. జూన్ 4న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ ట్రైలర్ సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు.

రామ్ చరణ్ సందడి ముగియకముందే మరుసటి రోజు అర్ధరాత్రి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన బాక్సాఫీస్ వేటను ప్రారంభించబోతున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మే 19 అర్ధరాత్రి  విడుదల చేయనున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ మరియు ఎన్టీఆర్ ఇంటెన్సిటీ కలిస్తే ఎలా ఉంటుందో ఈ గ్లింప్స్ ద్వారా చూపించబోతున్నారు. ఇప్పటికే ‘డ్రాగన్’ (Dragon) అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ తో సినిమా లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకే వారంలో చరణ్ ‘పెద్ది’ ట్రైలర్, మరోవైపు తారక్ ‘ఎన్టీఆర్-నీల్’ గ్లింప్స్.. ఈ రెండూ సోషల్ మీడియా రికార్డులను తిరగరాయడం ఖాయం. మొత్తానికి మే 18 మరియు 19 తేదీల్లో నెట్టింట మాస్ సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతున్నాయి