ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ఇప్పుడు వెనకబడిపోయారు. ఆయన డైరెక్షన్ లో 2018లో “అమర్ అక్బర్ ఆంటోనీ” విడుదలైంది. రవితేజ, ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ఇప్పటి వరకు ఆయన నెక్స్ట్ మూవీ వెండితెరపైకి రాలేదు. అయితే ప్రస్తుతం శ్రీనువైట్ల చేతిలో హిట్ మూవీ “ఢీ” సీక్వెల్ ఉంది. మంచు విష్ణు హీరోగా “ఢీ అంటే ఢీ” అనే టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నాడు.
Read Also : నెవర్ బిఫోర్ రికార్డులు సెట్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్
ఇక విషయానికొస్తే… శ్రీనువైట్ల మరోసారి ‘దూకుడు’ ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు. సరిగ్గా దశాబ్దం క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన “దూకుడు” బాక్సాఫీస్‌ని బద్దలు కొట్టింది. ఇది మహేష్ కెరీర్‌లో అతిపెద్ద హిట్. సూపర్ స్టార్ అభిమానులకు మరపురాని హిట్ అందించిన దర్శకుడు శ్రీను వైట్ల మరోసారి మహేష్ కోసం స్క్రిప్ట్‌ని సిద్ధం చేస్తున్నాడట. ఆ స్క్రిప్ట్ తనకు పూర్తిగా సంతృప్తిగా అనిపించిన తరువాతనే మహేష్ కు చెప్తాడట. మరోవైపు నేటితో “దూకుడు” విడుదలై పదేళ్లు పూర్తి కాగా, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్పెషల్ షోలు వేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ సూపర్ స్టార్ అభిమానులు ప్రత్యేకంగా ‘దూకుడు’ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
కామెడీ టైమింగ్, మహేష్ బాబు క్యారెక్టరైజేషన్, ఆయన మ్యానరిజమ్ బాగా పని చేశాయి. సూపర్ స్టార్ మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. అతనిని పూర్తిగా వినోదాత్మక పాత్రలో చూసి అభిమానులు అలాగే సాధారణ ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. తన కామెడీ టైమింగ్‌కు సరిపడని కథలను తప్పుగా ఎంచుకోవడం వల్లే తాను పరాజయాలను ఎదుర్కొన్నానని దర్శకుడు అంగీకరించాడు. “నేను ఈసారి సరైన స్క్రిప్ట్‌లతో వస్తున్నాను. విష్ణు మంచుతో డి & డి నవంబర్ 1 వ వారం నుండి ప్రారంభమవుతుంది. మ్యూజిక్ సిట్టింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. నా తదుపరి రెండు ప్రాజెక్ట్‌ల కోసం మరో రెండు స్క్రిప్ట్‌లను రెడీ చేశాను” అని శ్రీనువైట్ల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Unbelievable that it has already been a decade !!
— Sreenu Vaitla (@SreenuVaitla) September 23, 2021
With the mind blowing performance and invaluable support,@urstrulyMahesh has made this phenomenon possible!!
I also thank my dear friend @AnilSunkara1,@RaamAchanta, Gopichand and the entire cast and crew!!#DecadeForIHDookudu pic.twitter.com/yH0rQyZR0n