NTV Telugu Site icon

Kalpana : సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల మీడియా సమావేశం

Singar Kalpana

Singar Kalpana

టాలీవుడ్ ప్రముఖ సింగర్ కల్పన అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగడంతో ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ కల్పన ఆత్మహత్యకు పాల్పడిందని, భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నాయని రకరకాల వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం కోలుకున్న సింగర్ కల్పన తాజాగా ఓ వీడియో రిలీజ్ చేస్తూ ‘ మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పుడు వార్త  ప్రచారం జరుగుతుంది. నేను నా భర్త సపోర్ట్ తో లైఫ్ లో కొని అచీవ్ చేయగలిగాను. పని ఒత్తిడి వలన నిద్ర పట్టడం లేదని ఎక్కువ డోస్ తీసుకున్నాను దాని వల్లే ఇలా అయింది అని వీడీయో రిలీజ్ చేసింది

Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్ లు ఇవే

కాగా కొద్దీ సేపటి క్రితం సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై హోలీ స్టిక్ వైద్యుల మీడియా సమావేశం నిర్వహించారు. కల్పన రికవరీ అవుతున్నారు. ఆమె లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉంది. ఆమెకు ఇంకా చికిత్స అవసరం.రెండు మూడు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తాం. ఆక్సిజన్ కూడా తీసి వేసాము. ఇప్పడు కల్పన నార్మల్ గానే శ్వాస తీసుకుంటున్నారు. నిన్నటిదాకా లిక్విడ్ ఫుడ్ అందించాం ఇప్పుడు నార్మల్ ఫుడ్ తీసుకుంటుంది. అపాస్మరక స్థితిలో ఉన్నప్పుడు కల్పన హాస్పిటల్కి తీసుకువచ్చారు. వెంటి లేటర్ మీద చికిత్స అందించాము. ఊపిరితిత్తుల్లోకి వాటర్ చేరితే చికిత్స అందించాము. సమయానికి చికిత్స అందించడం వల్ల ఆమె కోలుకోగలిగారు. మానసికంగా ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించాము’ అని వైద్యులు తెలిపారు.