పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ స్టైలిష్ చిత్రం OG. ఈ రోజు రాత్రి 10 గంటల ప్రీమియర్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రీమియర్ షోస్ టికెట్స్ కు ఎక్కడాలేని డిమాండ్ ఉంది. మరి ముఖ్యంగా నైజాంలో ఒక్కో టికెట్ రూ. 1200 నుండి రూ. 2000 వరకు పలుకుతోందంటే అర్ధం చేసుకోండి డిమాండ్ ఎలా ఉంది.
Also Read : OG : పవర్ స్టార్ ‘OG’ కథ.. ఇన్ సైడ్ టాక్ ఇదే.. ఆ సినిమాని పోలి ఉన్నట్టుందిగా?
కాగా పవర్ స్టార్ కొడుకు అకిరా నందన్ OG సినిమాను ఎక్కడ చూడబోతున్నాడు అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం అకిరా ఈ రోజు సాయంత్రం 10.00 షోను హైదరాబాద్ బాలానగర్ లో ఉన్న మైత్రి విమల్ థియేటర్ లో చూడబోతున్నాడు. అకిరాతో పాటు దర్శక దిగ్గజం SS రాజమౌళి, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఈ ప్రీమియర్ కు రాబోతున్నాట్టు తెలుస్తోంది. అకిరా వస్తుండడంతో ఈ ప్రీమియర్ ను భారీ స్థాయిలో సెలెబ్రేట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు పవర్ స్టార్ అభిమానులు. మరోవైపు అనకాపల్లి నుండి అమెరికా వరకు OG సెలెబ్రేషన్స్ ను కనివిని ఎరుగని రీతిలో చేస్తున్నారు ఫ్యాన్స్. వింటేజ్ పవన్ కళ్యాణ్ ను మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూడబోతున్నామని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి వారి అంచనాలను దర్శకుడు సుజిత్ నిజం చేసాడో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురుచూడక తప్పదు.
