Site icon NTV Telugu

Mahesh Babu: వామ్మో.. ఆ రోజు మహేష్ వేసుకున్న షర్ట్ రేటు లక్షా?

Mahesh Babu Shirt

Mahesh Babu Shirt

Do you Know Mahesh Babu Latest Brunello Cucinelli Shirt: తాజాగా సూపర్‌స్టార్‌ మహేశ్​ బాబు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్​ను కలిశారు. వరుస విజయాలతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్​ దూకుడు మీద ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి. ఇలా ఒక్కొక్కరూ తమ బ్యాట్లతో పరుగుల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాప్ టీమ్స్​ను చిత్తుగా ఓడించిన సన్​రైజర్స్ నెక్స్ట్ ఆర్సీబీతో సొంతగడ్డపై మ్యాచ్​కు రెడీ అయి పోయింది. ఉప్పల్​లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​కు సిద్ధమవుతున్న ఆరెంజ్ ఆర్మీ సోమవారం సూపర్​స్టార్ మహేష్ బాబును ఒక యాడ్ షూట్ లో కలిసింది.

Actor Naresh: సూపర్ స్టార్ కృష్ణపై పవన్ వ్యాఖ్యలు బాగా బాధ పెట్టాయి.. అయినా పవనే గెలవాలి!

ఈ సందర్భంగా మహేష్​తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎస్​ఆర్​హెచ్ కెప్టెన్ కమిన్స్ టాలీవుడ్ ప్రిన్స్​తో సరదాగా కాసేపు గడిపా అని ఆ పోస్ట్​కు క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీనికి మహేష్ రిప్లయ్ ఇచ్చాడు. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందన్నాడు.. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ ఫొటోలలో వైరల్ అయిన మహేష్ బాబు షర్ట్ ధర గురించి చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మేరకు మహేష్ బాబు ధరించిన షర్ట్ ధర అక్షరాలా 1,15,023 రూపాయలు. అంటే లక్షా పదిహేను వేల ఇరవై మూడు రూపాయలు. ఇక ఆ షర్ట్ బ్రాండ్ పేరు బ్రూనెల్లో కుసినెల్లి. ఇక ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.

Exit mobile version