Vijayakanth: అత్యంత విషమంగా స్టార్ హీరో ఆరోగ్య పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Vijayakanth Health Update: ఒకప్పటి తమిళ స్టార్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అసలు ఏమాత్రం నిలకడగా లేదని చెన్నైలోని మయత్ ఆస్పత్రి యాజమాన్యం నివేదిక ఇచ్చింది. డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో గత నవంబర్ 18న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. విజయకాంత్ దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నందున సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లినట్లు డీఎండీకే అప్పట్లో వెల్లడించింది. ఈ విషయమై అప్పట్లో డీఎండీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ‘‘డీఎంయూడీఐ అధ్యక్షుడు విజయకాంత్ సాధారణ వైద్య పరీక్షల కోసం వెళ్లారు, ఒకట్రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారు, వదంతులను ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. అయితే ఆయన హాస్పిటల్ లో చేరిన వెంటనే విజయకాంత్‌కు కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు మీడియాలో వార్తలు ప్రచురితమవ్వగా.. నవంబర్ 20న డీఎండీకే పార్టీ అధిష్టానం ఆ వార్తలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అయితే సుమారు తొమ్మిది రోజులు అనంతరం ఈ రోజు (29-11-2023), DMDK అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మయత్ హాస్పిటల్ పరిపాలన ఒక కొత్త వైద్య నివేదికను విడుదల చేసింది.
Salman Khan: సల్లూ భాయ్ ఏ దేశమైనా పారిపో.. కానీ లేపేస్తాం?
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
అందులో విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందని, అయినప్పటికీ, గత 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేనందున, పల్మనరీ చికిత్సలో సహాయం కావాలని పేర్కొంది. ఆయన త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని వెల్లడించింది. ఇక ఆసుపత్రిలో వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఆయనకి ఇంకా 14 రోజులు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అవసరం అని తెలుస్తోంది. ఇక అనారోగ్య పరిస్థితుల కారణంగా విజయకాంత్ క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ గా లేకున్నా ఆయన భార్య ప్రేమలత విజయ ప్రభాకరన్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విజయకాంత్ చివరిసారిగా తన పుట్టినరోజు సందర్భంగా డిఎండి ప్రధాన కార్యాలయంలో వాలంటీర్లను కలిశారు. ఆయనను వీల్ చైర్ మీద కూర్చోబెట్టి తీసుకొచ్చి వాలంటీర్లకు చేతులు వంచి కెప్టెన్, కెప్టెన్ అంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు. రీసెంట్ గా దీపావళిని తన కుటుంబంతో కలిసి ఇంట్లో జరుపుకుని సోషల్ మీడియాలో ఆ ఫోటోలు షేర్ చేశాడు విజయకాంత్. ఇక కొన్నాళ్ల క్రితం విలేకరులతో సమావేశమైన మంత్రి ఎం. సుబ్రమణ్యం.. విజయకాంత్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. విజయకాంత్‌కు ఇప్పటికే కిడ్నీ మార్పిడి జరిగిందని, సంబంధిత వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని కూడా ఆయన తెలియజేశారు. అ
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!