పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షడిగా వ్యవహరించారు. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలకు రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా ‘లాలా భీమ్లా’ సాంగ్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. థమన్ మాస్ మ్యూజిక్ అదరగొట్టేసాడు. ఈ సాంగ్ రిలీజైనప్పటినుంచి ఎక్కడ విన్నా ఇదే సాంగ్ ప్లే అవుతోంది అనడంలో అతిశయోక్తి లేదు.
ఇక న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచేశారు. లాలా భీమ్లా డీజే వెర్షన్ ని రిలీజ్ చేశారు. ఈ కొత్త సంవత్సర వేడుకల్లో లాలా భీమ్లా డీజేతో సౌండ్ బాక్సులు పేలిపోవాల్సిందే అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు. నార్మల్ గానే బాక్సులు బద్దలుకొట్టిన థమన్.. డీజే వర్షన్ ని ఇచ్చి పడేశాడు.. ప్రస్తుతం ఎక్కడ విన్నా లాలా భీమ్లా డీజే మారుమ్రోగుతోంది.
