యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన చివరి రెండు సినిమాలు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో నేరుగా విడుదల చేశాడు. కానీ ఆ రెండు సినిమాలకూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కడంతో ఈ కుర్ర హీరో మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం సిద్ధు “డీజే టిల్లు” అనే రొమాంటిక్ ఎంటటైనర్ తో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. “డీజే టిల్లు” సంక్రాంతికే థియేటర్లలో సందడి చేయాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా నిర్మాతలు “డీజే టిల్లు” కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న బిగ్ స్క్రీన్‌లలోకి రాబోతోంది.
Read Also : “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10″లో ఆక్వామ్యాన్… క్రేజీ రోల్
విమల్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ రొమాంటిక్ కామెడీ కేపర్‌లో సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్ గా నేహా శెట్టి నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “డీజే టిల్లు” టీజర్, ఆకట్టుకునే పాటలతో ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది. అయితే రవితేజ నటించిన “ఖిలాడీ” కూడా ఫిబ్రవరి 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరి ‘ఖిలాడీ’తో ‘డీజే టిల్లు’ పోటీ ఎలా ఉంటుందో చూడాలి.