యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన చివరి రెండు సినిమాలు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో నేరుగా విడుదల చేశాడు. కానీ ఆ రెండు సినిమాలకూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కడంతో ఈ కుర్ర హీరో మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం సిద్ధు “డీజే టిల్లు” అనే రొమాంటిక్ ఎంటటైనర్ తో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. “డీజే టిల్లు” సంక్రాంతికే థియేటర్లలో సందడి చేయాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా నిర్మాతలు…