NTV Telugu Site icon

Divya Sridhar: నా మాజీ భర్త ఎంతోమంది అమ్మాయిల్ని మోసం చేశాడు.. ఆ పైలట్ చావుకి కారణమయ్యాడు

Arnav Divya Issue

Arnav Divya Issue

Divya Sridhar Reveals Secrets About Her Ex Husband Arnav: తమిళ ఇండస్ట్రీకి చెందిన మాజీ జంట అర్ణవ్, దివ్య శ్రీధర్‌ల వివాదం గుర్తుందా? దివ్య గర్భిణీగా ఉన్న సమయంలో.. తామిద్దరం విడిపోతున్నామని వాళ్లు ప్రకటించారు. అంతేకాదు.. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. దివ్యకు అంతకుముందే పెళ్లయ్యిందని, ఆ విషయాన్ని దాచి తనని మోసం చేసిందంటూ అర్ణవ్ ఆరోపిస్తే.. అతనికి మరో అమ్మాయితో సంబంధాలున్నాయంటూ దివ్య బాంబ్ పేల్చింది. తనని వేధింపులకు కూడా గురి చేస్తున్నాడంటూ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు.. తనకు అర్ణవ్ నుంచి ప్రాణహాని కూడా ఉందంటూ కమిషనర్ కార్యాలయానికి ఎక్కింది. ఇలా ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటూ.. కొంతకాలం తమ వివాదాన్ని సాగదీశారు. ఆ తర్వాత ఈ గొడవ సైలెంట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి దివ్య శ్రీధర్ తన మాజీ భర్తపై సంచలన ఆరోపణలు చేసింది.

Kanti Velugu : రికార్డు దిశగా కంటివెలుగు.. 1.58 కోట్ల మందికి పైగా పరీక్షలు

ఇటీవలే ఓ పాపాయికి జన్మనిచ్చిన దివ్య శ్రీధర్.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన మాజీ భర్త అర్ణవ్ గురించి మాట్లాడుతూ.. ఓ పైలట్ చావుకు కారణమయ్యాడంటూ ఆరోపించింది. అర్ణవ్ తనని తాను గేగా ఓ పైలట్‌తో పరిచయం చేసుకున్నాడని, అతని వద్ద నుంచి భారీ డబ్బులు దోచుకొని మోసం చేశాడని తెలిపింది. ఆ బాధని దిగమింగుకోలేక.. ఆ పైలట్ ఆత్మహత్య చేసుకున్నాడని బాంబ్ పేల్చింది. ఎంతోమంది అమ్మాయిలను కూడా అర్ణవ్ మోసం చేశాడని, ఓ ట్రాన్స్‌జెండర్‌ని కూడా నట్టేట ముంచాడని పేర్కొంది. ఈ మేరకు ఆడియో క్లిప్స్‌తో పాటు అమ్మాయిలతో అర్ణవ్ చేసిన చాటింగ్ స్క్రీన్‌షాట్లను బయటపెట్టింది. ఓ ఆడియె క్లిప్‌లో ఒక ట్రాన్స్‌జెండర్ మాట్లాడుతూ.. అర్ణవ్ తనని పదేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. తాము కొన్నాళ్లు సంతోషంగా గడిపామని.. ఆ తర్వాత మరో మహిళతో పరిచయం ఏర్పడటంతో అర్ణవ్ తనని వేధించడం మొదలుపెట్టాడని పేర్కొంది. అర్ణవ్ వేధింపుల్ని తాను 8 ఏళ్లు భరించానని, ఆ క్లిప్‌లో ట్రాన్స్‌జెండర్ చెప్పుకొచ్చింది. ఇలా క్లిప్స్, స్క్రీన్ షాట్స్‌ని దివ్య బయటపెట్టడంతో.. వీళ్ల టాపిక్ మరోసారి సంచలనంగా మారింది.

Ambati Rambabu: చంద్రబాబు ప్రవేశపెట్టింది మేనిఫెస్టో కాదు.. మోసఫెస్టో

కాగా.. దివ్య శ్రీధర్‌కు 2013లోనే ఓ వ్యక్తితో పెళ్లి అయ్యింది. వీరికి ఓ పాప కూడా పుట్టింది. అయితే.. మనస్పర్థల కారణంగా వాళ్లు విడిపోయారు. అనంతరం ఆమెకు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో.. సహనటుడు అర్ణవ్‌ పరిచయం అయ్యాడు. అది ప్రేమగా మారడంతో.. 2022 జూన్‌లో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భం దాల్చింది. అయితే.. అదే సమయంలో దివ్యకు అంతకుముందే పెళ్లై, ఓ కూతురు ఉందన్న సంగతి అర్ణవ్‌కు తెలిసింది. మరోవైపు.. అర్ణవ్ మరో నటి అన్షితతో ఎఫైర్ నడుపుతున్నాడని వ్యవహారం దివ్యకు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలై, తమ సీక్రెట్స్ బజారున పెట్టుకున్నారు.