Divya Agarwal : బిగ్ బాస్ హౌస్‌లో మద్యం, సిగరెట్లు, బాత్రూమ్ సీక్రెట్స్ పై దివ్య అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divya Agarwal : బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత కంటెస్టెంట్ల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. 24 గంటలూ కెమెరాల నిఘాలో ఉండే ఆ ఇంట్లో నిజంగా ఏం జరుగుతుంది? కెమెరాలకు కనిపించని సమయం ఉంటుందా? కంటెస్టెంట్లకు మద్యం ఇస్తారా? సిగరెట్లు ఎలా అందిస్తారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి సీజన్లో ప్రేక్షకుల మనసుల్లో మెదులుతూనే ఉంటాయి. ఇప్పటివరకు ఇవన్నీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. అయితే తాజాగా బిగ్ బాస్ ఓటీటీ తొలి సీజన్ విజేత దివ్య అగర్వాల్ ఈ షోకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టడంతో మరోసారి బిగ్ బాస్ హౌస్ చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ‘షార్డులజీ’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న దివ్య అగర్వాల్, బిగ్ బాస్ హౌస్‌లోని జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడింది. బయట ప్రజలు అనుకునే చాలా విషయాలు నిజం కాదని ఆమె స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇంట్లో ఆహార పదార్థాలకు సంబంధించి ఉండే కఠినమైన నియమాల గురించి చెబుతూ, కాఫీ, టొమాటో కెచప్ వంటి సాధారణ వస్తువులు కూడా అక్కడ విలాసవంతమైన వస్తువులుగా పరిగణిస్తారని తెలిపింది. కొన్ని సందర్భాల్లో కెచప్ దొరకకపోతే తానే తయారు చేసుకుని ఉపయోగించేదాన్నని నవ్వుతూ గుర్తు చేసుకుంది.
Also Read
అయితే సిగరెట్ల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని దివ్య వెల్లడించింది. పోటీదారులకు ప్రతిరోజూ వారు ఏ బ్రాండ్ సిగరెట్లు కావాలో అడిగి, అదే బ్రాండ్‌ను అందిస్తారని చెప్పింది. ప్రేక్షకుల్లో ఎక్కువగా వినిపించే మరో ప్రశ్న బిగ్ బాస్ హౌస్‌లో మద్యం అందిస్తారా? అనేదే. దీనిపై కూడా దివ్య స్పష్టత ఇచ్చింది. ఇంట్లో మద్యం అందిస్తారని చాలా మంది అనుకుంటారని, కానీ అది పూర్తిగా తప్పుడు ప్రచారమని తెలిపింది. షోలో ఉన్నంతకాలం ఎవరికీ మద్యం ఇవ్వరు అని ఆమె స్పష్టం చేసింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదే ప్రశ్నను తనను పదేపదే అడుగుతారని చెప్పింది.
చివరగా హౌస్ లో శృంగారం గురించి ప్రశ్నించగా దివ్య నవ్వుతూ స్పందించింది. కెమెరాల్లో అన్నీ కనిపించవని, కొన్ని విషయాలు ప్రేక్షకులకు తెలియవని పరోక్షంగా అంగీకరించింది ఈ ఆమ్మడు. అదే సమయంలో పాడ్‌కాస్ట్ హోస్ట్ శార్దుల్ పండిట్ కూడా బాత్రూమ్లోనే చాలా విషయాలు జరుగుతాయని సరదాగా వ్యాఖ్యానించాడు. అయితే దివ్య ఈ అంశంపై స్పష్టమైన వివరాలు వెల్లడించకుండా నవ్వుతూనే సమాధానం ఇచ్చింది. బిగ్ బాస్ షోపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి ఎంత ఎక్కువో, దాని చుట్టూ తిరిగే పుకార్లు కూడా అంతే ఎక్కువ. దివ్య అగర్వాల్ కొన్నింటికి సమాధానం చెప్పినప్పటికీ, మరికొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానం దాటవేసింది. అందుకే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌస్ రహస్యాలపై ఆసక్తి కూడా పెరుగుతూనే ఉంది.
తాజావార్తలు
-
Divya Agarwal : బిగ్ బాస్ హౌస్‌లో మద్యం, సిగరెట్లు, బాత్రూమ్ సీక్రెట్స్ పై దివ్య అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!
-
Mukesh Ambani: షేర్ మార్కెట్ ‘సూపర్ కింగ్’గా ముకేశ్ అంబానీ.. అంబానీ తదుపరి టార్గెట్ అదేనా?
-
Tim David Bike Celebration: బంగ్లాదేశ్‌పై ఆసీస్ క్లీన్‌స్వీప్.. బైక్‌పై స్టేడియం చుట్టేసిన టిమ్ డేవిడ్.. వైరల్ వీడియో.!
-
Love & war : మూవీ సెట్లో కార్మికుడి మృతి… 50 లక్షలు డిమాండ్
-
SSC CGL 2026: ఎస్ఎస్సీ సీజీఎల్ 12,256 పోస్టులు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!