Site icon NTV Telugu

“ఆర్ఆర్ఆర్” పోస్ట్ పోన్… డిస్ట్రిబ్యూటర్ల వ్యతిరేకత

RRR

RRR

2018లో “ఆర్ఆర్ఆర్” సినిమాను ప్రకటించారు. అప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి విడుదల తేదీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే మూడు సార్లు మార్చారు. మొదట్లో 30 జూలై 2020 అన్నారు. ఆ తర్వాత సినిమా 8 జనవరి 2021కి మారింది. ఈ తేదీ నుండి ఇప్పుడు 2021 అక్టోబర్ 13కి మార్చారు. ఇప్పటికి కూడా “ఆర్ఆర్ఆర్” అక్టోబర్ 13న విడుదలవుతుందనే నమ్మకం లేదు. పైగా సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే “ఆర్ఆర్ఆర్” జాప్యం కారణంగా మిగతా సినిమాలు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. దీంతో రాజమౌళిపై పంపిణీదారుల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Read Also : గ్లింప్సె : “భీమ్లా నాయక్” బ్రేక్ టైం… మోత మోగాల్సిందే

తాజా బజ్ ప్రకారం మూవీ మేకర్స్ “ఆర్ఆర్ఆర్”ను 2022 ఉగాదిన విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్ లో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తోడు “ఆర్ఆర్ఆర్” పోస్ట్ పోన్ న్యూస్ పంపిణీదారులలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. మరింత ఆలస్యం చేస్తే పోటీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది డిస్ట్రిబ్యూటర్లకు ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పరిస్థితి, డిస్ట్రిబ్యూటర్ల వ్యతిరేకత వంటి అంశాలతో “ఆర్ఆర్ఆర్” టీం సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. మరి “ఆర్ఆర్ఆర్” టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Exit mobile version