NTV Telugu Site icon

Vadhuvu: పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలను భయపెట్టేలా “వధువు” వెబ్ సిరీస్ ట్రైలర్

Vadhuvu Trailer

Vadhuvu Trailer

Disney Plus Hotstar Specials “Vadhuvu” web series trailer out: సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ “వధువు”ను ప్రేక్షకులకు అందిస్తోంది. అవికా గోర్, నందు, అలీ రెజా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని ఎస్వీఎఫ్ బ్యానర్ లో శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహిస్తున్న “వధువు” వెబ్ సిరీస్ డిసెంబర్ 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో ఈరోజు ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. “వధువు” వెబ్ సిరీస్ ట్రైలర్ విషయానికి వస్తే ‘వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు, కానీ ఈ పెళ్లిలో అన్నీ రహస్యాలే అంటూ పెళ్లి కూతురు ఇందు చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఆనంద్ ను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లిన ఇందుపై వివిధ రకాలుగా హత్యా యత్నాలు జరుగుతుంటాయి అయితే ఇవన్నీ అనుకోకుండా జరిగినట్లు కాకుండా.. ఎవరో కావాలని చేసినట్లే ఉంటాయి.

అత్తవారింట్లో ప్రతిఒక్కరి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపిస్తుంటుంది, ఓ అపరిచిత మహిళ అసలైన ఆట ఇప్పుడే మొదలైంది అనడం…ఇందుకు రాబోతున్న ప్రమాదాలను సూచిస్తుందని చెప్పచ్చు. అయితే ఇందు ఈ మిస్టరీలోని నిజాలు తెలుసుకుందా..? ఆమె అత్తవారింటి వారి ప్రవర్తన వెనుక కారణాలు కనుక్కుందా? అనే సందేహాలతో వధువు ట్రైలర్ ఆసక్తికరంగా కట్ చేసారు మేకర్స్. వీఎస్ రూపా లక్ష్మి, మౌనిక, మాధవి ప్రసాద్, శ్రీధర్ రెడ్డి, అమ్మ రమేష్, కాంచన్ బమ్నే, కేఎల్ కే మణి, శ్రీదేవి అర్రోజు, సౌజాస్, ఇందు అబ్బే, సురభి పద్మజ, తులసీ శ్రీనివాస్, సురభి దీప్తి, శుభశ్రీ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ కి ఆర్ట్ డైరెక్టర్ గా షర్మిల, సినిమాటోగ్రఫర్ గా రామ్ కె మహేశ్, మ్యూజిక్ డైరెక్టర్ గా శ్రీరామ్ మద్దూరి వ్యవరిస్తున్నారు.