Site icon NTV Telugu

Prabhas : ప్రభాస్ పై హీరోయిన్ సంచలన కామెంట్స్.. అలా చేస్తాడంటూ..

Disha Patani

Disha Patani

Prabhas : రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు ఆ పాన్ ఇండియా స్టార్. ఇక ప్రభాస్ సినిమాల్లో ఫుడ్ గురించే ఆ అందరూ మాట్లాడుకుంటారు. తన సినిమా షూటింగ్ కు వచ్చే ఆర్టిస్టులకు స్పెషల్ గా భోజనాలు పంపించడం తన పెదనాన్న కృష్ణంరాజు నుంచే నేర్చుకున్నాడు ప్రభాస్. ఎంతైనా రాజుల ఫ్యామిలీ కదా.. అందుకే మర్యాదలకు ఏ మాత్రం తక్కువ కాకుండా చూసుకుంటాడు. ఇప్పటికే ఎంతో మంది ఈ విషయాలను తెలిపారు. తాజాగా హీరోయిన్‌ దిశా పటానీ ఒక ఆసక్తికర విషయం వెల్లడించింది. దిశా పటానీ మాట్లాడుతూ – “కల్కి 2898 AD మొదటి పార్ట్ షూటింగ్ సమయంలో ప్రభాస్‌ చాలా కేర్ తీసుకున్నాడు.

Read Also : Pawan Kalyan : రూ.150 కోట్లు వదులుకున్న పవన్ కల్యాణ్‌.. గొప్పోనివయ్యా

ప్రతీరోజు తన ఇంటి నుంచి పెద్ద ఎత్తున ఫుడ్ క్యారేజీలు పంపించేవాడు. అంత మంచి ఫుడ్ చూస్తే ఎవరు కంట్రోల్ అవుతారు.. అందుకే నేను కూడా ఆ ఫుడ్ ను ఇష్టంగా తినేసేదాన్ని. ఆ వంటకాల వల్ల నా డైట్ పూర్తిగా చెడిపోయింది,” అంటూ నవ్వుతూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రభాస్‌ తన కో-స్టార్స్‌కి ఫుడ్ పంపడం కొత్త విషయం కాదు. గతంలో కూడా ఆయనతో పనిచేసిన అనుష్క, శ్రద్ధా కపూర్‌, పూజా హెగ్డే వంటి హీరోయిన్లకు ఇలాంటి ఫుడ్స్ పంపించేవాడు. సదరు హీరోయిన్లు కూడా ఇదంతా ప్రభాస్ పంపించిన ఫుడ్ అని ఎన్నో వీడియోలు చేశారు. ఆ మధ్య శృతిహాసన్ కూడా సలార్ షూటింగ్ లో ప్రభాస్ పంపించిన ఫుడ్స్ గురించి వీడియో తీయగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

Read Also : Mithra Mandali : “మిత్ర మండలి” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Exit mobile version