NTV Telugu Site icon

KALKI2898AD: హ్యాపీ బర్త్‌డే రాక్సీ.. కల్కిటీమ్ నుండి హీరోయిన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

D

D

Disha Patani : దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ప్రభాస్ కల్కి, సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న కల్కి ట్రైలర్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని.. ఇలా పలువురు స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ కి రెండు వారాలు ఉండగానే వన్ మిలియన్ ప్రీ-సేల్స్ తో అమెరికాలో రికార్డులను ప్రారంభించింది.

Also Read; Illicit Relationship: ప్రియురాలిపై మోజు.. 22నెల చిన్నారిని నేలకేసి కొట్టిన ప్రియుడు

ఇప్పటికే పలువురు స్టార్స్ క్యారెక్టర్ పేర్లు రివీల్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా దిశా పటాని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. నేడు దిశా పటాని పుట్టిన రోజు కావడంతో కల్కి మూవీ టీమ్ నుంచి బర్త్ డే విషెష్ చెప్తూ తన క్యారెక్టర్ పేరు రాక్సీ అని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దిశా గోడకు అననుకొని తన నడుము అందాలు చూపిస్తూనే మరో పక్క పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది. అంతే కాకుండా ట్రైలర్ లో దిశా పటాని ఫైట్ చేస్తున్నట్టు ఒక షాట్ కూడా చూపించారు. సినిమాలో ప్రభాస్ కి దిశా లవర్ అని తెలుస్తుంది. అలాగే ఫైట్స్ కూడా చేయబోతోందని తెలుస్తుంది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోసే ఈ బాలీవుడ్ భామ కల్కి సినిమాలో రాక్సీ గా ఎలా మెప్పిస్తుందో చూడాలి.