Site icon NTV Telugu

Disha Patani: లో దుస్తులకు ఈ పాప చేసే ప్రమోషన్ ఉంటుంది మాస్టారూ.. వేరే లెవెల్ అంతే

Disha

Disha

Disha Patani: సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే అందులో ఆ పాత్ర పేరుతో నటీనటులు ఫేమస్ అవుతారు. ఇంకొందరు వారు చేసిన యాడ్స్ వలన.. ఉపయోగించే వస్తువుల వలన ఫేమస్ అవుతారు. బాలీవుడ్ బ్యూటీ దిశా మాత్రం లో దుస్తుల బ్రాండ్ తోనే ఫేమస్ అయ్యింది. కాల్విన్ క్లైన్ అంటే దిశా.. దిశా అంటే కాల్విన్ క్లైన్ అని చెప్పుకుంటున్నారు. అంతలా ఆమె చేసే ప్రమోషన్స్ ఉంటున్నాయి మరి. దిశా తెలుగువారికి కొత్తేమి కాదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది దిశా ఒలకబోసిన అందాలకు తెలుగు అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా తరువాత చాలా ఏళ్ళు అమ్మడు తెలుగువైపు చూడలేదు. ఇన్నేళ్లకు ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాతో మరోసారి తెలుగు బాట పట్టింది దిశా.

Aditi Rao Hydari: సిద్దార్థ్ గర్ల్ ఫ్రెండ్ ను చూశారా.. ఏ రేంజ్ లో చూపిస్తుందో..?

ఇక సినిమాల విషయం పక్కన పెడితే కాల్విన్ క్లైన్ అనే లో దుస్తుల బ్రాండ్ కు దిశా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. అస్సలు ఆ బ్రాండ్ కు అంతగా పేరు వచ్చింది అంటే అది ఈ భామ వలనే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అస్సలు కాల్విన్ క్లైన్ ప్రమోషన్స్ చేయడంలో దిశా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. గతంలో ఇలాగే దీపావళీ శుభాకాంక్షలు కాల్విన్ క్లైన్ లో దుస్తుల్లో చెప్పి లేనిపోని గొడవలు తెచ్చుకుంది. ఇలా ప్రతిసారి ఈ భామ కాల్విన్ క్లైన్ యాడ్స్ లో అందాలను ఆరబోస్తూ అదరగొడుతుంది. తాజాగా వర్షంలో దిశా కాల్విన్ క్లైన్ ప్రమోషన్ మొదలుపెట్టింది. పింక్ కలర్ బ్రా, పాంటీ వేసుకొని దానిపై వైట్ కలర్ షర్ట్ వేసుకొని వర్షం లో తడుస్తూ.. కాల్విన్ క్లైన్ బ్రాండ్ ను చూపించింది. ఎద అందాలను, నడుమును, థైస్ అందాలను ఆరబోసి కుర్రాళ్లను మత్తెక్కించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఏదిఏమైనా కాల్విన్ క్లైన్ కు ప్రమోషన్ చేయాలంటే నీ తరువాతే అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version