NTV Telugu Site icon

Yeshasvi: మొదటి సినిమా రిలీజ్ కూడా అవకుండానే సుకుమార్ బ్యానర్ లో రెండో సినిమా

Sukumarwritings Ropes In Director Yeshasvi

Sukumarwritings Ropes In Director Yeshasvi

Director Yeshasvi roped in by Sukumar Writings for a new film: సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లో సిద్దార్థ్ రాయ్ చిత్ర ద‌ర్శ‌కుడు వి య‌శ‌స్వి త‌దుప‌రి సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. ప్ర‌తిభ గ‌ల క‌ళాకారుల‌ను, సాంకేతిక నిపుణుల‌ను ప్రోత్స‌హించ‌డంలో క్రియేటివ్ జీనియ‌స్ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఎల్ల‌ప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయ‌న ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసి తొలి చిత్రంతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యాలు అందుకున్న ద‌ర్శ‌కులు కొంద‌రైతే, ఆయ‌న‌ను త‌మ గురువుగా భావించి ఏక‌ల‌వ్య శిష్యులుగా మారిపోయి సినిమాలు తెర‌కెక్కించే ద‌ర్శ‌కులు మ‌రి కొంద‌రు ఉన్నారు. అలా ఏక‌ల‌వ్య శిష్యుడి జాబితాలో ఉన్నాడు ద‌ర్శ‌కుడు య‌శ‌స్వి వి.

Game Changer: అసలైన గేమ్ చేంజర్ దిగాడు.. ఇక జరగండి జరగండి జరగండి!

దీప‌క్ స‌రోజ్ హీరోగా య‌శ‌స్వి సిద్థార్థ్ రాయ్ పేరుతో ఓ వైవిధ్య‌మైన ప్రేమ‌క‌థా చిత్రాన్ని రూపొందించాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు ఈ సినిమా రానుంది. కాగా సిద్దార్థ్ రాయ్ చిత్రం విష‌యంలో య‌శ్వ‌సి ప్ర‌తిభ‌ను చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యాడు ద‌ర్శ‌కుడు సుకుమార్‌. అందుకే సుకుమార్ త‌న సొంత నిర్మాణ సంస్థ అయిన సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లో య‌శ‌స్వి త‌దుప‌రి చిత్రం చేసే అవ‌కాశం ఇచ్చారు. ఇప్ప‌టికే సుకుమార్ రైటింగ్స్‌లో ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలు నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సుకుమార్ రైటింగ్స్ సంస్థ ప‌లు అగ్ర నిర్మాణ సంస్థ‌ల‌తో క‌లిసి పాన్ ఇండియా సినిమాల‌తో పాటు విభిన్న‌మైన, వైవిధ్య‌మైన చిత్రాల‌ను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.