NTV Telugu Site icon

Venu Yeldandi : తన రెండవ సినిమా పనులు మొదలు పెట్టిన దర్శకుడు వేణు..

Whatsapp Image 2023 06 20 At 8.28.38 Am

Whatsapp Image 2023 06 20 At 8.28.38 Am

కమిడియన్‌ గా పలు సినిమాల లో అలరించిన వేణు.. అత్యంత ఆదరణ పొందిన జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకుంటూ మంచి గుర్తింపు ను సంపాదించారు.ఆ తర్వాత తను దర్శకత్వం వహించిన మొదటి సినిమా బలగం సినిమా తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.సైలెంట్ గా వచ్చిన బలగం సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం మనందరికి తెలిసిందే. మొదటి సినిమాతో నే డైరెక్టర్‌ గా మంచి విజయం సాధించాడు వేణు… అతని రెండో చిత్రం ఎప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నే వేణు అదిరిపోయే అప్‌డేట్ ను ఇచ్చారని తెలుస్తుంది . తను తీయబోతున్న రెండో సినిమా స్క్రిప్టు పనుల్ని సోమవారం నాడు ప్రారంభించానని సోషల్ మీడియాలో వేదిక గా ఆయన తెలిపారు.. ఇందుకు సంబంధించి పెన్ను మరియు పేపర్ ఫోటోని కూడా ఆయన షేర్ చేశారు.

దీనిపై నెటిజన్లు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కూడా  బలగం సినిమా లాగే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కొంతమంది నెటిజన్స్ మంచి యాక్షన్‌ తో కూడిన థ్రిల్లింగ్ కథ రాయమని కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే వేణు ఎలాంటి సినిమా తీయనున్నారు,అందులో హిరో హిరోయిన్‌ లు ఎవరు అనే విషయాలు మాత్రం తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.. తెలంగాణ సంస్కృతి మరియు సంప్రదాయలు మీద తీసిన బలగం సినిమా పెద్ద హిట్ అయింది.. ఓటీటీ లో కూడా ఈ సినిమా విశేషమైన ఆదరణ పొందింది. తెలంగాణలో ని పలు గ్రామాల్లో ఈ సినిమాని ఊరంతా చూసేలా ప్రదర్శించడం విశేషం.. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది.బలగం సినిమాను మంచి ఎమోషన్ తో తెరకెక్కించాడు దర్శకుడు వేణు. తన రెండవ సినిమా లో కూడా అలాంటి ఎమోషనల్ సీన్స్ ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.

Show comments