Venkatesh Maha: అతడు నీచ్ కమీనే కుత్తే అయితే.. నువ్వెంటీ మరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkatesh Maha: ఒక సినిమా కొంతమందికి నచ్చుతుంది.. కొంతమందికి నచ్చదు. ఆ సినిమాలో నచ్చిన పాయింట్స్ ను చూసేవారు కొంతమంది అయితే.. నెగెటివ్ పాయింట్స్ ను మాత్రమే ఏరికోరి వెతికి వాటపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. సినిమా ఒక ఎంటర్ టైనర్. నచ్చింది.. నచ్చలేదు అని చెప్పడం ఒక ప్రేక్షకుడు ఇష్టం. కానీ, ఆ సినిమాను, సినిమా తీసినవారిని కించపర్చేలా మాట్లాడడం మాత్రం గౌరవించదగ్గ విషయం కాదు. అందులోనూ ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ తీసిన సినిమాపై ఇలాంటి ఘాటు ఆరోపణలు చేయడం అంటే ఆయన పరువే కాదు టాలీవుడ్ పరువును కూడా తీసినట్టే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అసలు ఏంటి ఇదంతా అంటే.. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో మంచి ఫ్యాషనేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు వెంకటేష్ మహా. మొదటి సినిమానే మంచి గుర్తింపు రావడంతో వెంకటేష్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగింది. ఇక ఈ సినిమా తరువాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే రీమేక్ చేసి మెప్పించాడు.. ఈ మధ్యనే నటుడిగా కూడా మారిన ఇతగాడు కొద్దిగా నోరు జారాడు.
గతేడాది రిలీజ్ అయిన సినిమాల్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కెజిఎఫ్ చిత్రంపైనే సంచలన కామెంట్స్ చేశాడు. మరీ చిల్లరగా వాడు, వీడు అని, నీచ్ కమీనే కుత్తే అని తిట్టిపోశాడు. ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో సెగలు రేపుతున్నాయి. కన్నడ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి కోసం ఒక కొడుకు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి.. చివరికి ఆమె కోరుకున్న విధంగా ఎదుగుతాడు. ఈ సినిమా అందరిని మంత్రముగ్దులను చేసింది. అలాంటి సినిమాను ఒక పాప్ కార్న్ సినిమా అని.. ఆ నీచ్ కమీనే కుత్తే గాడు తీసిన సినిమాకు జనాలు చప్పట్లు కొడుతున్నారని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు వెంకటేష్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నువ్వు తీసిన రెండు సినిమాలకు ఎందుకు నీకు అంత పొగరు.. సినిమా తీయడం తెలుసా నీకు.. అది ఒక సినిమా.. నచ్చితే నచ్చిందని చెప్పు.. నచ్చకపోతే నచ్చలేదని చెప్పు.. అంతేకానీ ఈ విధంగా మాట్లాడడానికి నీకేం హక్కు ఉంది. ఆ సినిమా తీసి అతడు నీచ్ కమీనే కుత్తే అయితే.. వారి గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావ్ మరి నిన్నేం అనాలి అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ కామెంట్స్ సెగ ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!