NTV Telugu Site icon

Dragon: ‘డ్రాగన్’ మూవీ పై ప్రశంసలు కురిపించిన దర్శకుడు శంకర్

February 7 2025 02 24t111917.127

February 7 2025 02 24t111917.127

‘లవ్ టుడే’ మూవీతో భాషతో సంబంధం లేకుండా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు తమిళ దర్శకుడు కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఇక ఇప్పుడు రీసెంట్ గా ‘డ్రాగన్’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రదీప్ సరసన అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్‌ నటించింది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీలో కూడా యూత్‌కు కనెక్ట్ అయ్యే ప్రేమ, బ్రేకప్, కాలేజ్, కెరీర్ అనే అంశాల చుట్టూనే తిప్పాడు ప్రదీప్. దీంతో తాజాగా యూత్‌కి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా తీసినందుకు గాను.. కోలివుడ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఈ మూవీ పై ప్రశంసలు కురిపించారు..

Also Read:Urvashi Rautela: మరో బంపర్ ఆఫర్ కొట్టెసిన ఊర్వశి రౌతేలా !

‘ ‘డ్రాగన్’ ఓ మంచి కథా.. చిత్రించిన తీరు కూడా అద్భుతంగా ఉంది. హ్యాట్సాప్ అశ్వత్ మారిముత్తు సినిమాలోని పాత్రలన్నీ చూడచక్కగా ఉన్నాయి.. ప్రతి ఒక్కరు వారి పాత్రలో లీనం అయిపొయి నటించారు. ఇక ప్రదీప్ రంగనాథన్ మరోసారి తనలోని నటుడిని పరిచయం చేశారు. ఆయన నటన అద్భుతంగా ఉంది. సినిమాలో చివరి 30 నిమిషాలు మాత్రం నన్ను ఎంతగానో కదిలించాయి. ఆ సన్నివేశం చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను. మోసాలతో నిండిపోతున్న సమాజానికి ఇలాంటి సందేశాలు చాలా అవసరం. నిర్మాణ సంస్థతో పాటు మొత్తం టీమ్‌కు నా అభినందనలు’ అని ఆయన రాసుకొచ్చారు.

ఇక శంకర్ పోస్ట్‌కి వేంటనే ప్రదీప్ రెస్పాండ్ అయ్యాడు..‘సర్. నేను మీ సినిమాలు చూస్తూ పెరిగాను. ఒక అభిమానిగా ఎప్పటికి మీ నుంచి స్ఫూర్తి పొందుతుంటాను. మీ నుంచి ఇలాంటి సందేశం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. దీనిని నేను నమ్మలేకపోతున్నా. నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా థాంక్యూ సో మచ్ సార్’ అని రిపై ఇచ్చాడు.