NTV Telugu Site icon

Singam Series: నార్త్ సౌత్ ‘సింహాలు’ కలుస్తాయా?

Singam Series

Singam Series

కోలీవుడ్ హీరో సూర్యకి తెలుగులో మార్కెట్ ని అమాంతం పెంచిన సినిమా ‘యముడు’. ‘సింగం ఫ్రాంచైజ్’లో భాగంగా వచ్చిన ఈ ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘సింగం 2’, ‘సింగం 3’ సినిమాలు చేసి సూర్య హిట్స్ కొట్టాడు. పవర్ ఫుల్ ఆఫీసర్ సినిమాలు అనగానే గుర్తొచ్చే రేంజూలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన ‘సింగం’ సినిమాలని హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశాడు. ‘సింగం, సింగం రిటర్న్స్’ పేరుతో రీమేక్ చేసి అజయ్ దేవగన్ సూపర్ హిట్స్ కొట్టాడు. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్స్ నార్త్ సినీ అభిమానులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తమిళ ‘సింగం’ నుంచి మూడో సినిమా వచ్చింది కానీ హిందీలో రెండు పార్ట్స్ మాత్రమే వచ్చాయి. థర్డ్ పార్ట్ కోసం అజయ్ దేవగన్ ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈలోపు రోహిత్ శెట్టి, అక్షయ్ కుమార్ తో ‘సూర్యవన్షీ’ అనే సినిమా చేశాడు. ఈ మూవీ క్లైమాక్స్ లో అజయ్ దేవగన్ మళ్లీ ‘సింగం’ గెటప్ లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులని మెప్పించాడు.

‘సూర్యవన్షీ’ సినిమా చూసినప్పటి నుంచి ఆడియన్స్ ‘సింగం 3’ ఎప్పుడు అని అడుగుతున్నారు. దీంతో రోహిత్ శెట్టి ‘సింగం అగైన్’ సినిమాని త్వరలో మొదలుపెట్టబోతున్నాడు అనే వార్త బీ-టౌన్ లో వినిపిస్తోంది. ‘సూర్యవన్షీ’ క్లైమాక్స్ లో అజయ్ దేవగన్ ఒక టెర్రరిస్ట్ కోసం పాకిస్థాన్ వెళ్తున్నట్లు చూపించారు కాబట్టి ‘సింగం అగైన్’ పాకిస్థాన్ నేపధ్యంలో తెరకెక్కనుంది. అయితే ప్రస్తుతం ఇండియాలో పాన్ ఇండియా హవా ఉంది, దాన్ని కాష్ చేసుకుంటూ రోహిత్ శెట్టి ‘సింగం యూనివర్స్’లోకి సూర్యని తీసుకోని రాబోతున్నాడట. అజయ్ దేవగన్ సూర్యలు కలిసి ఈ కాప్ యూనివర్స్ లో నటిస్తే, ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటి. మరి బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న ఈ న్యూస్ ని రోహిత్ శెట్టి నిజం చేస్తాడా లేక ఇది ఒక రూమర్ గా మిగిలిపోతుందా అనేది చూడాలి.

Show comments