Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీకి ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో హైప్ మామూలుగా లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ప్రభాస్ అంత ఈజీగా వాయిస్ ఓవర్ ఇవ్వడు. కానీ ఈ మూవీకి ఇవ్వడం వెనకాల ఉన్న రీజన్ ను తాజాగా వివరించారు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఈ సినిమా కోసం మేం పెద్దగా కష్టపడలేదు. అన్నీ అలా కుదిరాయి అంతే. ఎవరి కోసం మేం ఎక్కువగా కష్టపడకపోవడం ఈ సినిమా కథ స్పెషాలిటీ. తేజకు కథ చెప్పగానే చిన్న చిన్న మార్పులు చేయాలన్నాడు తప్ప.. పెద్దగా కంప్లయింట్లు లేవు.
Read Also : OG : సుజీత్ కు అగ్నిపరీక్ష.. పవన్ మీదే ఆశలు..
ఇక ప్రభాస్ ను అడగ్గానే ఒప్పేసుకున్నాడు. ఇలాంటి కథలకు తన వాయిస్ తో వెయిట్ వస్తుందని నేను నమ్మాను. ఒక పెద్ద స్టార్ హీరో ఇలాంటి కథలకు వాయిస్ ఓవర్ ఇస్తే.. ఆ కథ ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్తుంది. అందుకే ప్రభాస్ ను ఒకసారి అడగ్గానే ఆయన కూడా మా ఆరాటాన్ని అర్థం చేసుకున్నారు. వెంటనే ఓకే చేశారు. మేం అనుకున్నట్టే ఆయన వాయిస్ తో కథకు వెయిటేజ్ వచ్చింది. ఆ రెస్పాన్స్ ఇప్పుడు కనిపిస్తోంది. రానాతో కూడా ఒక సిట్టింగ్ లోనే ఒప్పించాం. ఇలా అందరూ ఈ సినిమాకు మంచి వాళ్లే ముందుకు వచ్చారు అంటూ తెలిపాడు కార్తీక్.
Read Also : Sai Durga Tej : సెకండ్ క్లాస్ లోనే లవ్ చేశా.. రీసెంట్ గా బ్రేకప్ అయింది
