Site icon NTV Telugu

Adipurush: ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించిన డైరెక్టర్.. కానీ!

Adipurush Release Date

Adipurush Release Date

ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ముగిసింది కానీ, ఇప్పటివరకూ కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రాలేదు. రామాయణం ఇతివృత్తంతో రూపొందుతోన్న చిత్రం కాబట్టి.. శ్రీరామనవమి నాడే ఫస్ట్ లుక్ రావొచ్చని ఫ్యాన్స్ ఆశించారు. కానీ.. దర్శకుడు ఓమ్ రౌత్ ఆ ఆశలపై నీళ్లు చల్లేశాడు. ఫ్యాన్ మేడ్ వీడియోతో అడ్జస్ట్ చేసుకోండని చేతులెత్తేశాడు. పోనీ, ఇతర సందర్భాల్లో ఏమైనా ప్లాన్ చేశారా? అంటే అదీ లేదు. అప్పుడప్పుడు పలు ట్వీట్లతో దర్శకుడు కాస్త ఎగ్జైట్మెంట్ అయితే పంచాడు కానీ, అప్డేట్స్ మాత్రం ఏమీ ఇవ్వలేదు.

ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత ఓమ్ రౌత్ పెద్ద అప్డేటే ఇచ్చాడు. ఏకంగా రిలీజ్ డేట్‌ని ప్రకటించాడు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ‘ఆదిపురుష్’ని రిలీజ్ చేయబోతున్నామని, అప్పటివరకూ తానూ ఆగలేకపోతున్నానని ట్వీట్ చేశాడు. ఇది నిజంగా పండగలాంటి వార్తే! కానీ, సినిమా నుంచి ఎలాంటి పోస్టర్ విడుదల చేయకపోవడమే కాస్త నిరాశ కలిగించే విషయం. సాధారణంగా.. రిలీజ్ డేట్ లాంటి మేజర్ అప్డేట్స్ ఇచ్చినప్పుడు, పోస్టర్‌తో అనౌన్స్ చేయడం ఆనవాయితీ. ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఆ పోస్టర్ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుంది. ఫ్రీగా పబ్లిసిటీ వచ్చిపడుతుంది. కానీ, ఇక్కడ ఓమ్ రౌత్ ఆ ఆనవాయితీకి భిన్నంగా పోస్టర్ రిలీజ్ చేయకుండా, ఐమ్యాక్స్ కెమెరాతో దిగిన తన ఫోటోని మాత్రమే పోస్ట్ చేశాడు.

కాగా.. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా, రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో గ్రాఫికల్ వండర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో.. నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు చాలా ఎలిమెంట్స్ జోడించామని ఓమ్ రౌత్ ముందు నుంచీ చెప్తూ వస్తున్నాడు. దీంతో, ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. రిలీజ్ కోసం ఆడియన్స్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

Exit mobile version