తలపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “బీస్ట్” సినిమా అనౌన్స్మెంట్ నుంచే హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. “బీస్ట్” మేకర్స్ సినిమాను శరవేగంగా రూపొందిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ‘బీస్ట్’ అలజడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సినిమా ఏ దశలో ఉంది ? అప్డేట్స్ ఎప్పటి నుంచి వస్తాయి? అనే విషయం గురించి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. టీమ్ తాజాగా ఓ ఫోటోను షేర్ చేస్తూ సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది అనే విషయాన్నీ వెల్లడించింది. ఈ పిక్ ని ట్విట్టర్‌లో పంచుకుంటూ దర్శకుడు నెల్సన్ “ఇది “100వ రోజు షూటింగ్… ఈ అద్భుతమైన వ్యక్తులతో 100 రోజులు సరదాగా గడిపాము” అంటూ కామెంట్ చేశారు.
Read Also : టైం ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్… “బింబిసార” టీజర్
ఇక ‘బీస్ట్’ తర్వాత విజయ్ దిల్ రాజు నిర్మాణంలో రాబోయే భారీ ప్రాజెక్ట్ ను రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్టు ను తాత్కాలికంగా ‘తలపతి 66’ అని పిలుస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ఇది అతిపెద్ద తమిళ, తెలుగు భాషల్లో రూపొందనున్న ద్విభాషా చిత్రంగా నిర్మితం కానుంది.
