Site icon NTV Telugu

Project K: ప్రభాస్ ఎంట్రీ సీన్.. ప్రాణం పెట్టి తీస్తున్నామన్న డైరెక్టర్

Project K

Project K

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న విషయం విదితమే. అందులో ఒకటి ప్రాజెక్ట్ కె.  టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని శరవేగంగా శూరింగ్ జరుపుకొంటుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనె నటిస్తుండగా .. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించిన అప్డేట్ ను ఎప్పుడెప్పుడు ఇస్తారా అంటూ అభిమానులు నాగ్ అశ్విన్ ను ట్విట్టర్  వేదికగా అడుగుతూనే ఉన్నారు.

ఇక తాజాగా  ఈ డైరెక్టర్ ఒక కీలక అప్డేట్ ను అభిమానులకు తెలిపాడు.  “ఇటీవలే ఒక షెడ్యూల్ ను పూర్తి చేశాం. ప్రభాస్ ఇంట్రో సన్నివేశాలను చిత్రీకరించాం. సినిమా లో ఆయన లుక్ చాలా కూల్ గా ఉంటుంది. జూన్ నుండి తదుపరి షెడ్యూల్ ను మొదలు పెట్టబోతున్నాం. సినిమా కోసం అందరం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం”అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇటీవలే రాధేశ్యామ్ పరాజయంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశకు గురైన విషయం విదితమే. దీంతో ఇప్పడూ వారి ఆశలన్నీ ప్రాజెక్ట్ కె, సలార్ మూవీస్ పైనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇంట్రో అదిరిపోయింది అని డైరెక్టర్ చెప్పడంతో ఇక హైప్ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవుతుందా ..?అని ఎదురుచూస్తున్నారు. మరి మేకర్స్ ఆ గుడ్ న్యూస్ ను ఎప్పుడు అభిమానులకు చెప్తారో చూడాలి.

 

Exit mobile version