Site icon NTV Telugu

Macherla Niyojakavargam : నితిన్ సినిమా ఈవెంట్ లో దర్శకుడు మిస్!

Macharla Neyojika Vargam

Macharla Neyojika Vargam

Director missing in Nitin’s movie event!
చేసిన తప్పులు ఎప్పటికైనా వెంటాడతాయనేది అందరూ చెబుతుండే మాట. అది ‘మాచర్ల నియోజకవర్గం’ దర్శకుడి విషయంలో నిజమైంది. టాలీవుడ్ లో ఎడిటర్ ఎస్‌ఆర్ శేఖర్‌గా పేరున్న నితిన్ తాజా సినిమా దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్‌ను కీర్తిస్తూ చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్ కావడంతో కుల రాజకీయాల వలయంలో చిక్కుకున్నాడు. అయితే ఆ ట్వీట్లు తనవి కావని తన ఎకౌంట్ హ్యాక్ అయిందని కంప్లైంట్ చేశాడు కూడా. అయినా హీరో నితిన్ పై ఆ ట్వీట్స్ తాలూకు వత్తిడి ఉంది. అందుకే గుంటూరులో జరిగిన ‘మాచర్ల నిజయోకవర్గం’ ఈవెంట్ కి దర్శకుడిని దూరంగా పెట్టడమే కాదు కనీసం అతగాడి పేరు కూడా ఉచ్ఛరించలేదు.
‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం గుంటూరులో జరిగింది. అంతేకాదు ఈ వేడుకలో సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడిన హీరో నితిన్ అతిథిగా వచ్చిన అనిల్ రావిపూడిని పొగిడేశాడు. అంతే కాదు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, హీరోయిన్లు కృతి, కేథరిన్, సంగీత దర్శకుడు సాగర్‌ను కూడా ప్రశంసించాడు. అయితే తన సినిమా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి గురించి ఒక్క లైన్ కూడా మాట్లాడలేదు. నిజానికి నితిన్‌ పవన్ కళ్యాణ్‌ కి వీరాభిమాని. ఆయనతో పాటు టీడీపీ వర్గాలను దూరం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ‘మాచర్ల నియోజకవర్గం’ ఈవెంట్ నుంచి దర్శకుడి తప్పించినట్లు కనిపిస్తోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడని సన్నిహితులు ఎంత నొక్కి చెబుతున్నా… అసలు విషయం మాత్రం ఇదే అంటున్నారు. మరి ఈవెంట్ లో కనిపించకుండా పోయిన దర్శకుడు రిలీజ్ కి ముందు మీడియా ఇంటర్వ్యూలలోనైనా మాట్లాడతాడేమో చూడాలి.

Exit mobile version