Site icon NTV Telugu

Mani Ratnam : భారీ కలెక్షన్స్ కోసమే సినిమాలు చేయొద్దు.. మణిరత్నం హాట్ కామెంట్స్..

Maniratnam

Maniratnam

Mani Ratnam : స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుంచి వస్తున్న మూవీ థగ్ లైఫ్. కమల్ హాసన్ ఈ మూవీలో హీరోగా చేస్తున్నారు. శింబు, త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్ 5న మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా మణిరత్నం ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తాను ఏ సినిమా చేసినా అందులోని పాత్రలు, కంటెంట్ మీదనే దృష్టి పెడుతానని చెప్పారు. తన లక్ష్యం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే అని.. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే సినిమాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అదే తనను ఇన్నేళ్లు సినిమా ఇండస్ట్రీలో నిలబడేలా చేసిందన్నారు.

Read Also : Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందెవరు..?

తమిళంలో వెయ్యి కోట్ల సినిమాలు రావట్లేదని చాలా మంది అడుగుతున్నారు. దానికి నేను చెప్పేది ఒకటే. కలెక్షన్లు వచ్చే సినిమా ముఖ్యమా.. మంచి సినిమా ముఖ్యమా మీరే చెప్పండి. సినిమాలో కంటెంట్ బాగుండాలి. ప్రేక్షకులను ఆలోచింపజేయాలి. ఒకప్పుడు వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునేవి. ప్రతి సీన్ చూడాలనిపించేది. కానీ ఇప్పుడు హైప్, యాక్షన్ ఎక్కువ అయ్యాయి.

ఒక సినిమాలోని అన్ని సీన్లు ప్రేక్షకులకు నచ్చట్లేదు. కొన్ని సీన్లు మాత్రమే వారికి నచ్చుతున్నాయి. ఇది మారాలి. బాక్సాఫీస్ నెంబర్స్ కోసం కాకుండా మంచి కంటెంట్ తో మూవీని తీస్తే అందరికీ మంచి జరుగుతుంది. బాక్సాఫీస్ నెంబర్ల కోసం తీసే సినిమాలు అన్నీ ఆడుతాయనే గ్యారెంటీ ఉండదు. కానీ కంటెంట్ బాగుంటే సినిమా కచ్చితంగా ఆడుతుంది. అదే మనల్ని ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది’ అని వివరించారు.

Read Also : Spirit: రుక్మిణి, మృణాల్ కాదు, యానిమల్ బాభీ 2ని దింపుతున్నాడు

Exit mobile version