Site icon NTV Telugu

Thalaivar 171: రజినీ విలనిజం చూపించడానికి డైరెక్టర్ లోకీ ఆరు నెలల బ్రేక్

Thalaivar 171

Thalaivar 171

రీసెంట్‌గా లోకేష్ కనగరాజ్ నుంచి వచ్చిన లియో సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్‌ రిజల్ట్ అందుకుంది. అయినా కూడా భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు 540 కోట్లు రాబట్టినట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. లియో తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తలైవార్ 171 ప్రాజెక్ట్ చేయనున్నాడు లోకేష్. ఇప్పటికే అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. అయితే లియో ప్రమోషన్స్‌లో భాగంగా లోకేష్ కనగరాజ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్‌లోని విలనిజం అంటే తనకు చాలా ఇష్టమని, నెక్ట్స్‌ సినిమాలో తలైవాలోని నెగెటివ్ షేడ్స్‌ను మరోసారి చూపించబోతున్నానని చెప్పుకొచ్చాడు. అలాగే… రోబో సినిమా తర్వాత తలైవా 171లో సూపర్ స్టార్ విలనిజాన్ని ఎలివేట్‌ చేయబోతున్నాను… ఆయన పాత్రకు చాలా షేడ్స్‌ ఉన్నాయని అన్నాడు.

Read Also: Kota Bommali: నవంబరు 24న రిలీజ్ కానున్న పొలిటికల్ థ్రిల్లర్ ’కోట బొమ్మాళి పీఎస్’

అంతేకాదు… రజనీకాంత్‌ సినిమా కోసం ఆరు నెలల పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం రజనీకాంత్‌ సినిమాపైనే దృష్టి పెట్టబోతున్నా. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలుపెట్టాం అని తలైవర్ 171 మూవీ గురించి లోకీ చెప్పాడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అప్పటి వరకు లోకష్ నుంచి కొత్త సినిమా అప్డేట్స్ ఏమి ఉండవన్న మాట. లియోతో కాస్త డిజప్పాయింట్ చేసిన లోకేష్.. సూపర్ స్టార్‌తో బాక్సాఫీస్ బద్దలు చేయడానికి ఈ ఆరు నెలల సమయం తీసుకుంటున్నాడు. ఆ తర్వాత కార్తితో ఖైదీ సీక్వెల్‌ను మొదలు పెట్టనున్నాడు. మరి తలైవార్ 171 ఏ రేంజులో ఉంటుందో చూడాలి.

Exit mobile version