Kota Bommali: నవంబరు 24న రిలీజ్ కానున్న పొలిటికల్ థ్రిల్లర్ ’కోట బొమ్మాళి పీఎస్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో అనేక సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందుకుంది గీతా ఆర్ట్స్ 2 సంస్థ. GA2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు నిర్మించగా కొన్ని ఇతర భాషలు సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ లనుఅందుకున్నారు.తాజాగా మలయాళ సూపర్ హిట్ నాయాట్టు కి రీమేక్ గా కోట బొమ్మాళి పీఎస్ ను నిర్మించింది జీఏ 2 సంస్థ. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు.తేజ మార్నిదర్శకుడు. శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు చక్కన స్పందన రాగా, ఇటీవల విడుదల చేసిన లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు కొన్ని కోట్ల వ్యూస్ లభించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
దీంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించింది చిత్రబందం. నవంబరు 24న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా నేడు విడుదల తేది పోస్టర్ నువిడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన లింగిడి లింగిడి మాస్ జానపదం పాటతో అందరిలో సినిమాపై అంచనాలు పెరిగాయి. పోలీస్ కు రాజకీయనాయకుడికి మధ్య జరిగే పవర్ ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో నవంబరు 24న విడుదల కానుండంతొో ఈ సినిమాపై అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది. , జోహర్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!