Lokesh Kanagaraj: ప్రమోషన్స్ లో అపశృతి.. లియో డైరెక్టర్ కి గాయాలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lokesh Kanagaraj injured during leo promotions: విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో లియో అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఈ సినిమాను తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్ లో డివైడ్ టాక్ వచ్చినా వసూళ్ళ విషయంలో మాత్రం సినిమా దూసుకుపోతోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ కనగరాజ్ అండ్ మూవీ టీమ్ ఈరోజు కేరళ వెళ్ళింది. ఈ క్రమంలో కేరళలోని పాలక్కాడ్ లో ఒక మాల్ కి వెళ్లిన లోకేష్ కనగరాజ్ గాయపడినట్టు వెల్లడించారు. లియో సినిమా ప్రమోషన్ కోసం కేరళ వచ్చిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ గాయపడ్డారు. లోకేష్ కాలికి గాయం కావడంతో ప్రమోషన్స్ అర్దాంతరంగా నిలిపివేసి చెన్నైకి తిరిగి వెళ్ళిపోయాడు. కేరళలో ఇతర ప్రచార కార్యక్రమాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇక లోకేష్ కాలికి పాలక్కాడ్‌లోని అరోమా థియేటర్‌లో గాయం అయినట్టు తెలుస్తోంది. లియో ప్రమోషన్‌లో భాగంగా లోకేష్ కనగరాజ్ ఈ ఉదయం కేరళ చేరుకున్నారు. పాలక్కాడ్‌లోని అరోమా థియేటర్‌కి వచ్చిన దర్శకుడిని చూసేందుకు వందలాది మంది అభిమానులు తరలివచ్చారు.
The Great Indian Suicide: ఆహాలో హాఫ్ సెంచరీ కొట్టేసిన ది గ్రేట్ ఇండియన్ సూసైడ్
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
సినిమాను మలయాళంలో రిలీజ్ చేసిన గోకులం మూవీస్ సంస్థ పూర్తి భద్రతా వ్యవస్థలను సిద్ధం చేసినప్పటికీ.. థియేటర్‌లో లోకేష్‌ను చూసేందుకు జనం ఎగబడడంతో స్వల్ప తొక్కిసలాట జరిగి లోకేశ్‌కు గాయాలయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి సైతం చేశారు. ఇక ఈ క్రమంలో ఈరోజు జరగాల్సిన త్రిస్సూర్ రాగం థియేటర్, కొచ్చి కవితా థియేటర్ ఈవెంట్లు రద్దు చేయబడ్డాయి. కొచ్చిలో జరగాల్సిన ప్రెస్‌మీట్‌ను మరో రోజు నిర్వహించనున్నట్లు లోకేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈరోజు కూడా సెలవు కావడంతో హౌస్‌ఫుల్ షోలతో లియో రికార్డు కలెక్షన్లను రాబట్టుకుంటూనే ఉంది. అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన లియోలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిష్కిన్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీఖాన్, ప్రియా ఆనంద్, శాండీ, జనని, అభిరామి వెంకటాచలం, బాబు ఆంటోని ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో మరియు ది రూట్ బ్యానర్‌లపై లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి నిర్మించారు. గోకులం గోపాలన్ కేరళలో శ్రీ గోకులం మూవీస్ పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నారు.
Thank you Kerala for your love.. Overwhelmed, happy and grateful to see you all in Palakkad. ❤️
Due to a small injury in the crowd, I couldn’t make it to the other two venues and the press meeting. I would certainly come back to meet you all in Kerala again soon. Till then… pic.twitter.com/JGrrJ6D1r3
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 24, 2023
తాజావార్తలు
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
-
New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?