NTV Telugu Site icon

Krishna Vamsi: తెలంగాణ సాయుధ పోరాటంపై వెబ్ సిరీస్.. 300 కోట్ల బడ్జెట్

Krishna Vamsi

Krishna Vamsi

టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలు ప్రేక్షకులకు రుచించడం లేదు. కృష్ణవంశీ కూడా ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమాలను తెరకెక్కించలేకపోతున్నారు. గులాబీ, నిన్నే పెళ్లాడతా, సింధూరం, మురారి, ఖడ్గం, చందమామ వరకు గుర్తుండిపోయే సినిమాలు తీసిన కృష్ణవంశీ ఆ తర్వాత హిట్ అందుకోలేకపోయారు. లేటెస్టుగా ఆయన ‘రంగ మార్తాండ’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత రైతుల సమస్యల ఆధారంగా ‘అన్నం’ అనే సినిమాను కృష్ణవంశీ తెరకెక్కించనున్నారు.

Read Also: ప్రపంచంలోని అత్యధిక జనాభా గల టాప్-10 దేశాలు

మరోవైపు సినిమాల కంటే ఓటీటీలలోని వెబ్ సిరీస్‌లనే ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్న నేపథ్యంలో కృష్ణవంశీ కూడా ఓటీటీలలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు దేశ చరిత్రలోనే భారీ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తారని.. దీని కోసం రూ.300 కోట్ల బడ్జెట్‌ను ఖర్చు చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు తెలుగులో వెబ్ సిరీస్ కోసం ఎవరూ ఈ రేంజ్‌లో బడ్జెట్ ఖర్చు చేయలేదు. అటు సుదీర్ఘకాలం నడిచిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ అన్ని అంశాలను సినిమాలలో చూపించలేకపోయారు. వెబ్ సిరీస్ అయితే ప్రతి అంశాన్ని వివరించవచ్చు. అందుకే 50 ఎపిసోడ్లుగా ఈ అంశాన్ని వెబ్ సిరీస్‌గా తీయాలని కృష్ణవంశీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.