షిర్డీ సాయినాధుని సేవలో పవన్ కళ్యాణ్ దర్శకులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న ఇద్దరు దర్శకులు క్రిష్ జాగర్లమూడి, హరీశ్ శంకర్ నవంబర్ 10వ తేదీ షిర్డీ లో సాయినాధుని దర్శించుకున్నారు. అంతే కాదు వీరితో ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం కూడా ఉన్నారు. షిర్డీలో వీరు దిగిన ఫోటోను ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విశేషం ఏమంటే… ఈ రోజున దర్శకుడు క్రిష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు చిత్రసీమలోని పలువురు ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే క్రిష్ తీసిన ‘కొండపొలం’ సినిమా విడుదల కాగా, ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. ఈ ఎపిక్ మూవీకి ఎ.ఎం. రత్నం సమర్పకుడు కాగా, ఆయన సోదరుడు దయాకరరావు నిర్మాత. వచ్చే యేడాది ఏప్రిల్ 29న ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే మరో దర్శకుడు హరీశ్ శంకర్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ చేశాడు. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. మొత్తానికీ క్రిష్ పుట్టిన రోజున ఈ ముగ్గురూ సాయినాధుడిని దర్శించుకోవడం విశేషం!
Also Read
- Vishwanath and Sons Trailer: 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
- Ritika Nayak : 'కొరియన్ కనకరాజు'తో జాక్‌పాట్.. టాలీవుడ్‌కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
- Varun Tej : 'ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు'.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..
- CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
తాజావార్తలు
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్‌నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!