NTV Telugu Site icon

Ustaad: పవన్ కళ్యాణ్ ‘విజయ్’లా నటించట్లేదు మాస్టారు… అడగండి అప్డేట్ ఇస్తాను

Ustaad

Ustaad

పవర్ స్టార్ ఫాన్స్ కి మాత్రమే కాకుండా తెలుగు సినీ అభిమానులందరికీ ఫుల్ కిక్ ఇచ్చిన సినిమా ‘గబ్బర్ సింగ్’. హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ ని పవన్ కళ్యాణ్ స్వాగ్ తో చెప్తుంటే థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేశారు. అందుకే హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే సినీ అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. దశాబ్దాల కాలంగా ఫాన్స్ ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో రిపీట్ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ తమిళ్ లో దళపతి విజయ్ నటించిన ‘తెరి’ సినిమాకి రీమేక్ అనే మాట సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యి రచ్చ రచ్చ చేసింది. పవన్ కళ్యాణ్ మళ్లీ రీమేక్ సినిమా చేస్తున్నాడు, మాకు రీమేక్ వద్దు అంటూ పవన్ ఫాన్స్ ట్విట్టర్ లో షేక్ చేశారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ కాస్త ఎక్కువ హడావుడి చెయ్యడంతో దర్శకుడు హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రీమేక్ కదా అవునా అనే విషయంలో క్లారిటీ కూడా ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వగానే షూటింగ్ కి వెళ్లిపోవడానికి రెడీ అయిన హరీష్ శంకర్, రీసెంట్ గా ‘తెరి రీమేక్’ విషయంలో ఓపెన్ అయ్యాడు.

“ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరి సినిమాకి రీమేక్. అందులో విజయ్ బేకరీలో పని చేస్తే, ఇక్కడ పవన్ కళ్యాణ్ లెక్చరర్ గా పని చేస్తున్నాడు. అక్కడ విజయ్ కి కూతురు ఉంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ కి కొడుకుని పెడుతున్నారు” అని కోట్ చేసిన ఒక ట్వీట్ రిప్లై ఇస్తూ… “అది నిజం కాదు, సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటాను. అడగండి చెప్తాను” అంటూ హరీష్ శంకర్ స్ట్రెయిట్ ఆన్సర్ ఇచ్చాడు. అయితే హరీష్ శంకర్ “తెరి రీమేక్” అనే దాన్ని నిజం కాదు అన్నాడా? లేక “కూతురి ప్లేస్ లో కొడుకుని, బేకరీలో జాబ్ ప్లేస్ లో లెక్చరర్”ని చెయ్యడం విషయం నిజం కాదు అన్నాడా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ యాత్రలో ఉన్నాడు. అందులో నుంచి పవన్ కాస్త ఫ్రీ అవ్వగానే ‘ఉస్తాద్ భగత్’ సినిమాని ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి అప్పుడు ‘రీమేక్’ అనే విషయంలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Show comments