పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘భీమ్లా నాయక్’ ని పూర్తి చేసిన పవన్ నెక్స్ట్ ‘హరిహర వీరమల్లు’ను ముంగించే పనిలో పడ్డాడు. ఇక దీని తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ ని మొదలుపెట్టనున్నాడు. గబ్బర్ సింగ్ తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడం వలన ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలనే పెట్టుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక అప్డేట్ కూడా లేకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తూ హరీష్ శంకర్ ని అప్డేట్ ఇవ్వమని కోరారు.
ఇక దీంతో హరీష్ అభిమానుల కోరికను మన్నిస్తూ తనదైన స్టైల్లో సంధానం ఇచ్చారు. ట్విట్టర్ లో వాయిస్ మెసేజ్ ద్వారా ఆయన మాట్లాడుతూ” సినిమాలో టైమింగ్ ఎంత ముఖ్యమో.. సినిమాకు టైమింగ్ అంతే ముఖ్యమని నేను నమ్ముతా.. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు మీతో పంచుకుంటా.. మీ సపోర్ట్, ఓపికకు ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వస్తాయి అని తెలియడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
— Harish Shankar .S (@harish2you) February 6, 2022