Site icon NTV Telugu

K-Ramp : కె-ర్యాంప్ అంటే బూతు కాదు.. అర్థం చెప్పిన డైరెక్టర్

K Ramp

K Ramp

K-Ramp : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న మూవీ కే-ర్యాంప్. కిరణ్ యాక్ట్ చేస్తున్న 11వ సినిమా ఇది. ఈ మూవీ అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. కె-ర్యాంప్ అనే టైటిల్ పై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అదో బూతు పదం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దానిపై తాజాగా డైరెక్టర్ జైన్స్ నాని స్పందించాడు. కె-ర్యాంప్ అంటే కిరణ్‌ అబ్బవరం ర్యాంప్ అని స్పష్టం చేశాడు. అది తెలియక చాలా మంది దీన్ని బూతు పదం అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. కిరణ్ ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా కథ రాశాను. ఈ మూవీలో హీరో పాత్ర పేరు కుమార్. అది కూడా కలిసొస్తుందనే అలా టైటిల్ పెట్టాం అని క్లారిటీ ఇచ్చుకున్నాడు.

Read Also : The Paradise : ప్యారడైజ్ నుంచి మోహన్ బాబు మరో లుక్.. మామూలుగా లేదే

హీరో కిరణ్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా నవ్వుకునేలా ఉంటుంది. నాని నాకు ఈ కథ చెప్పినంత సేపు నేను నవ్వుకుంటూనే ఉన్నాను. థియేటర్లలో మీరు కూడా నవ్వుకునేలా ఉంటుంది ఈ మూవీ. సినిమా హిట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే.. ఈ మూవీతో నాకు మంచి బ్రదర్ దొరికాడు. నాని విజన్ అంటే నాకు చాలా ఇష్టం. మూవీ కోసం చాలా కష్టపడుతాడు. మా కష్టం మీకు థియేటర్లలో కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమా చేశాననే సంతృప్తి నాలో ఉంది. ఈ సినిమా థియేటర్లలో చూసి మీరే డిసైడ్ చేయాలి అంటూ తెలిపాడు కిరణ్‌ అబ్బవరం. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : R Narayana Murthy : చిరంజీవి చెప్పిందే నిజం.. ఆర్.నారాయణ మూర్తి రియాక్ట్

Exit mobile version