NTV Telugu Site icon

Chiranjeevi: నా తమ్ముడిని బయటకు వెళ్ళమనడానికి నువ్వు ఎవడ్రా?. చిరు వార్నింగ్

Chiru

Chiru

Chiranjeevi: మెగా బ్రదర్స్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్.. ముగ్గురు దేహాలు వేరైనా ప్రాణాలు ఒకటే. అన్న గురించి తప్పుగా మాట్లాడితే తమ్ముళ్లు ఊరుకోరు. తమ్ముడి గురించి ఎవరైనా ఏదైనా అంటే అన్నలు అస్సలు వదలరు. ఇది మెగా ఫ్యాన్స్ అందరికి తెలుసు. అన్నదమ్ముళ్ల అనుబంధం గురించి ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా కథలు కథలు గా చెప్తారు. తాజాగా తమ్ముడిని ఒకరు ఒక మాట అన్నారని చిరు కోపంతో రగిలిపోయిన ఒక ఘటనను డైరెక్టర్ బాబీ అభిమానులతో పంచుకున్నాడు. గతరాత్రి జరిగిన భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన బాబీ.. తమ్ముడి కోసం చిరు ఏం చేశాడో చెప్పుకొచ్చాడు. ఒకానొక సందర్భంలో షూటింగ్ జరుగుతున్న ఇంటి ఓనర్ తో పవన్ గొడవపెట్టుకొని అలిగి వెళ్ళిపోతే.. చిరు ఆ ఓనర్ కు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపాడు. తమ్ముడి కోసం అన్న ఏదైనా చేస్తాడు అని చెప్పుకొచ్చాడు.

Hyper Aadi: పెగ్ వేసి పవర్ స్టార్ గురించి మాట్లాడితే.. హైపర్ ఆది వార్నింగ్

” పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా ఒక ఇంటిలో జరుగుతుంది. అప్పుడే అక్కడకు ఆ ఇంటి ఓనర్ వచ్చాడు. అతను ఒక పెద్ద డాక్టర్. లైట్స్ మ్యాన్స్, యూనిట్ అంతా షూస్ వేసుకొని ఇంట్లో తిరగడం చూసి అరిచేశాడు. ఇడియట్స్, స్కౌండ్రల్స్.. గెట్ అవుట్.. ఎవడ్రా వేసుకోమన్నది మిమ్మల్ని చెప్పులు..అని బూతులు తిడుతున్నాడు. అది విన్న పవన్ కళ్యాణ్ గారు ఇంటి ఓనర్ తో గొడవపడ్డారు. షూటింగ్ కు డబ్బులు ఇచ్చాం కదా.. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే .. లేదు చెప్పులు లేకుండా చేయాల్సిందే అన్నాడు.. వెంటనే పవన్ కళ్యాణ్ గారు.. వాళ్ళు చెప్పులు వేసుకోకుండా పనిచేస్తే నేను ఇక్కడ షూటింగ్ చేయను అని అలిగి వెళ్లిపోయారు. ఇక ఈ విషయం ఎక్కడో విన్న చిరంజీవి గారి చెవిన పడింది. వెంటనే ఆ ఓనర్ కు కాల్ చేసి.. బూతులు తిట్టేశారు. నా తమ్ముడిని ఎవడ్రా నువ్వు బయటికి వెళ్ళమనడానికి.. ఎవడ్రా నువ్వు.. నీ ఇల్లేంత..? సినిమా వాళ్ళు కష్టపడతారని తెలియదా.. ? డబ్బు తీసుకొనే కదా ఇల్లు ఇచ్చావ్..? నీకు ఇంటి మీద అంత ప్రేమ ఉంటే ఇంటికి తాళం వేసుకోని కుటుంబంతో ఉండు.. షూటింగ్లకు ఇచ్చి రెంట్లు డబ్బులు గుంజకండి.. నా తమ్ముడు వెళ్ళిపోయాడు కాబట్టి ఊరుకున్నా.. అదే అక్కడే ఉంటే అక్కడకు వచ్చి షూటింగ్ జరిపించేవాడిని అని అన్నారు. తమ్ముడిని అంటే ఆయన అస్సలు ఊరుకోరు.. అభిమాన తమ్ముళ్ళను అన్నా కూడా ఆయన ఊరుకోరు” అని చెప్పుకొచ్చాడు.