Site icon NTV Telugu

కరోనా బారిన పడ్డ రవితేజ హీరోయిన్

Dimple-Hayathi

కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలామంది సెలెబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో హీరోయిన్ కు కోవిడ్-19 సోకింది. ప్రస్తుతం రవితేజతో “ఖిలాడీ” చేస్తున్న సౌత్ ఇండియన్ నటి డింపుల్ హయాతీకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అదే విషయాన్ని డింపుల్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ లో ప్రకటించింది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనా వైరస్ బారిన పడ్డానని డింపుల్ హయాతి తన పోస్ట్‌లో రాశారు. పూర్తిగా టీకాలు వేసుకున్న ఈ బ్యూటీ తనకు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది.

Read Also : వైరల్ వీడియో : పూణే పోలీసుల సృజనాత్మకతకు కరీనా కపూర్ ఫిదా

విషయం తెలిసిన వెంటనే ఇంట్లో తనను తాను సెల్ఫ్ క్వారంటైన్ లో ఉంచుకుంది హయాతి. ఇక తనకు కోవిడ్-19 పాజిటివ్ గా తేలిన సందర్భంగా తన అభిమానులను, అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, టీకాలు వేయించుకోవాలని, చేతులను పూర్తిగా శుభ్రపరచుకోవాలని అభ్యర్థించింది. అంతేకాకుండా నటి గతంలో కంటే బలంగా తిరిగి వస్తానని ఫ్యాన్స్ కు హామీ ఇచ్చింది. మరోవైపు “ఖిలాడీ” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 11న విడుదల కావలసిన ఈ సినిమా విడుదల అవుతుందా ? లేదంటే పోస్ట్ పోన్ అవుతుందా ? అనేది చూడాలి. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

Exit mobile version