NTV Telugu Site icon

Dimple Hayathi: పాపకు బంగారంతో గుడి కట్టాలంట ఫ్రెండ్స్

Dimple

Dimple

Dimple Hayathi: గద్దలకొండ గణేష్ చిత్రంలో ఐటెం గర్ల్ గా తెలుగుతెరకు పరిచయమైంది డింపుల్ హయతీ. ఆ ఒళ్ళు విరుపులు, స్టెప్పులు, డ్యాన్స్ తోనే కుర్రకారును తన వైపుకు తిప్పేసుకుంది. ఇక ఖిలాడీ లో లంగావోణీ వేసుకొని తెలుగింటి అందం మొత్తం చూపించేసింది.. ఆ తరువాత ఇప్పుడు రామబాణం అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిపోయింది. నిజం చెప్పాలంటే.. అమ్మడు.. తెలుగుతెరపై స్టార్ అవ్వడానికి బాగా గట్టిగా ట్రై చేస్తోంది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు అయితే వస్తున్నాయి కానీ, విజయాలే అందడం లేదు. అయితే రామబాణం డింపుల్ కు మంచి పేరునే తీసుకొచ్చి పెట్టేలా ఉంది. గోపీచంద్, డింపుల్ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 5 న రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని షురూ చేసిన చిత్ర బృందం.. ప్రమోషన్స్ చేయొచ్చు అన్న ప్రతిదాన్ని ఫోకస్ చేసింది.

Jabardasth Mahesh: ప్రభాస్ కామెడీ.. చెప్తే చెప్పావ్ కానీ బాసూ.. కడుపు నిండిపోయింది

ప్రెస్ మీట్లు, మీడియా ఇంటరాక్షన్, రీల్స్, ఫ్యాన్ మీట్స్, రీసెంట్ గా మీమర్స్ తో కూడా హీరోహీరోయిన్లు సినిమా కబుర్లను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు.. డింపుల్ చిలిపిగా ఆన్సర్ ఇచ్చి షాక్ ఇచ్చింది. స్టార్ హీరోయిన్లకు గుడులు కట్టడం ప్రస్తుతం ట్రెండ్ గా నడుస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఒక అభిమాని.. డింపుల్.. నీ గుడి కట్టడానికి నాకు పర్మిషన్ కావాలి.. పాలరాతితో కట్టనా.. ఇటుకరాయితో కట్టనా..? అని అడుగగా.. డింపుల్.. ఆ రాళ్లు అయితే వద్దు.. బంగారంతో గుడి కట్టు అంటూ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమా అమ్మడి ఫేట్ ను మారుస్తుందేమో చూడాలి.

Show comments