Dimple Hayathi: డింపుల్ ప్రాణాలకు హాని ఉంది.. డీసీపీ బెదిరిస్తున్నాడు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dimple Hayathi: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి వివాదం గురించి అందరికి తెల్సిందే. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కు డింపుల్ కు మధ్య మొదలైన కారు పార్కింగ్ గొడవ రోజు రోజుకు వివాదస్పదమవుతుంది. డింపుల్, రాహుల్ ఒకే అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని పార్కింగ్ ఏరియాలో ఆమె కాలితో తన్నిందని రాహుల్ డ్రైవర్ చేతన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్‌పై 353, 341, 279 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అయితే డింపుల్ తాను కారును తన్నలేదని, రాహుల్ కావాలనే తన మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తున్నాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రాహుల్ పై తాను న్యాయపోరాటానికి దిగుతున్నట్లు కూడా చెప్పింది. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటే కుదరదని న్యాయంఎప్పుడు నిజాయితీగా ఉన్నవారి వెంటే ఉంటుందని తెలిపింది. ఇక రాహుల్ సైతం.. డింపుల్ ను తప్పుపడుతూ మాట్లాడాడు. ఆమెకు ఇది మొదటిసారి కాదని, తన పార్కింగ్ ప్లేస్ లో కారు పక్కకు పెట్టమని చాలాసార్లు మర్యాదగా చెప్పానని, ఆమె తన డ్రైవర్ తో ఇష్టానుసారం మాట్లాడిందని తెలిపాడు. ఇక ఈ కేసుపై తాజాగా డింపుల్ లాయర్ మాట్లాడాడు. డీసీపీ వలన డింపుల్ కు ప్రాణహాని ఉందని ఆయన తెలపడం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
Bride Cancel Marriage: ప్రేమ పెళ్లి చేసుకుంది.. వెంటనే తాళి తీసి వెళ్లిపోయింది.. అసలేమైంది?
Also Read
డింపుల్ మీద పెట్టిన ఎఫ్ ఐ ఆర్ కాపీని ఇప్పుడే మా దగ్గరకు వచ్చింది. అందులో కారు కవర్ తీసినట్లు రాసి ఉంది. ఆ కవర్ తీసినట్లు మాకు ఆధారాలు చూపించమని మేము అడుగుతున్నాం. అసలు ప్రభుత్వ వాహనాలకు కవర్ లు ఇస్తారా..? ఇదంతా డీసీపీ చేయిస్తున్న నాటకం. అందులో డ్రైవర్ ను వాడుకుంటున్నాడు. రాహుల్.. డింపుల్ తో మిస్ బిహేవ్ చేశాడు. ప్రస్తుతం ఆమె ఈ గొడవ వలన చాలా డిప్రెషన్ కు గురైంది. ఆమె ఇంటి చుట్టూ ఎవరెవరో తచ్చాడుతున్నారని చెప్పుకొస్తున్నది. డింపుల్ కు ప్రాణహాని ఉంది. గుర్తుతెలియని వారు కాల్స్ చేసి బెదిరిస్తున్నారు” అంటూ డింపుల్ లాయర్ పాల్ సత్యనారాయణ తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!