NTV Telugu Site icon

Selfish: బర్త్ డేన ‘దిల్ ఖుష్…’ అంటున్న ఆశిష్‌!

Selfish

Selfish

Ashish: ‘రౌడీబాయ్స్’ చిత్రంతో నటుడిగా అందరి ఆదరణ పొందాడు ఆశిష్. అతను హీరోగా నటిస్తున్న రెండో సినిమా ‘సెల్ఫిష్’. పాతబస్తీ కుర్రాడిగా పూర్తి మాస్ పాత్రలో ఆశిష్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. యూత్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి క్రియేటివ్ జీనియస్ సుకుమార్ శిష్యుడు కాశీ విశాల్ దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్‌ రాజు – శిరీష్ ఈ చిత్రాన్ని ఎక్కడ రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రం నుండి మే 1న ఓ పాట రాబోతోంది. మే 1 హీరో ఆశిష్ బర్త్‌డే. ఆ సందర్భంగా ఈ చిత్రం నుంచి దిల్‌ఖుష్ అనే తొలి లిరికల్ వీడియో ను విడుదల చేస్తున్నారు.

ఇక సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాట మిక్కి జే. మేయర్ సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్‌లో ఆశిష్ మాస్‌లుక్‌లో బిందాస్ అటిట్యూడ్‌తో కనిపిస్తున్నాడు. పాత్రబస్తీ కుర్రాడిగా పూర్తి వైవిధ్యంగా, నేటి యువతరానికి నచ్చే విధంగా ఆశిష్ పాత్ర ఫుల్ మాసివ్‌గా ఎంటర్‌టైనింగ్ వుండబోతుందని ఈ పోస్టర్‌లో ఆశిష్‌ను చూస్తే తెలుస్తుంది. ఈ చిత్రలో ఇవనా హీరోయిన్‌గా నటిస్తోంది.