Dil Raju: టీనా శ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో మున్నా (ఎమ్. నాగ మునెయ్య) నిర్మాతగా, కొండ్రాసి ఉపేందర్ నందిపాటి శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం ‘మెకానిక్’. ‘ట్రబుల్ షూటర్’ అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ద్వారా ముని సహేకర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీ గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ”కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో ఒక బర్నింగ్ ప్రాబ్లమ్ ను బేస్ చేసుకుని వినోదాత్మకంగా తీసిన సందేశాత్మక చిత్రం ఇది” అన్నారు. మణిసాయి తేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రంలో రేఖ నిరోషా హీరోయిన్ గా నటిస్తోంది. అలానే తనికెళ్ళ భరణి, నాగ మహేశ్, సూర్య, సమ్మెట గాంధీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు ఆవిష్కరించబోతున్నారు. ‘ఛత్రపతి’ శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, వీరశంకర్, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, జబర్దస్త్ ఫణి, జబర్దస్త్ దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్ ఇందులో ఇతరపాత్రలలో కనిపించబోతున్నారు. వినోద్ యాజమాన్య ఈ సినిమాకు స్వర రచన చేశారు.
Mani Sai Teja: ‘దిల్’ రాజు ఆవిష్కరించనున్న ‘మెకానిక్’ మోషన్ పోస్టర్!

Dil Raju