Site icon NTV Telugu

Dil Raju: బంఫర్ ఆఫర్ పట్టిన దిల్ రాజు.. అతనిమీద ఇంట్రెస్ట్ తోనే..?

Dil Raju

Dil Raju

Dil Raju: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు బంఫర్ ఆఫర్ పట్టేసాడా..? అంటే నిజమే అన్న మాట వినిపిస్తోంది. కోలీవుడ్ బాహుబలి గా తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్ తెలుగు థియేటర్ రైట్స్ ను దిల్ రాజు చేజిక్కించుకోబోతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్ తో పాటు అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగు హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అందిపుచ్చుకున్నదని తెలుస్తోంది.

మొదటి నుంచి దిల్ రాజు కు మణిరత్నం అన్నా, ఆయన సినిమాలు అన్నా ఎంతో ఇష్టమని, ఆయన మీద ఇంట్రెస్ట్ తోనే దిల్ రాజు భారీ మొత్తం చెల్లించి ఈ సినిమా తెలుగు రైట్స్ ను కొనుగోలు చేసినట్లు చెప్పుకోస్తున్నారు. ఒక వేళ ఇదే కనుక నిజమైతే దిల్ రాజు పంట పండినట్లే. భారీ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తిని కనపరుస్తున్నారు. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం దిల్ రాజు ఖాతాలో మరో హిట్ పడినట్లే. ఇక ఈ విషయం అధికారికంగా రావాల్సి ఉంది.

Exit mobile version