Site icon NTV Telugu

Dil Raju: నేను ఎదిగానని ఓర్వలేకపోతున్నారు.. దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

Dil Raju

Dil Raju

Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజునూ ఇండస్ట్రీ టార్గెట్ చేసిందా..? అంటే నిజమే అంటున్నాడు దిల్ రాజు. గత కొన్నిరోజులుగా దిల్ రాజు.. వారసుడు వివాదంలో తలమునకలు అవుతున్న విషయం తెల్సిందే. సంక్రాంతి రేసులో ఇతర భాషల సినిమాలు ఉండకూడదు అని ప్రొడ్యూసర్ కౌన్సిల్ చెప్తుండగా.. దిల్ రాజు మాత్రం తన సినిమా వారసుడును సంక్రాంతి రేసులోనే నిలబెడతాను అంటున్నాడు.దీంతో దిల్ రాజుపై విమర్శలు వెల్లువెత్తాయి. నిర్మాతలు అందరు దిల్ రాజు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. దిల్ రాజు మాత్రం డబ్బుకోసం కాకుండా కేవలం తాను ప్రేక్షకులకు మంచి సినిమాను అందించాలనే కోరుకుంటాను అని చెప్పుకొస్తున్నాడు.

ఇక తాజాగా ఈ వివాదంపై దిల్ రాజు స్పందించాడు. వారసుడు వివాదంపై దిల్ రాజు మాట్లాడుతూ.. ” సంక్రాంతి రేసులో మా సినిమా పడాలి అంటే మా సినిమా పడాలి అని ఉంటుంది కాబట్టి మేము కూర్చొని మాట్లాడుకొంటే సరిపోతుంది. కానీ వారు అసలు మాట్లాడానికి ముందుకు రావడం లేదు. అసలు ప్రాబ్లెమ్ ఉందని కానీ, అప్రోచ్ అవ్వడం కానీ, ఏం చేద్దాం అని కానీ ఏం లేదు.. మేము చాలా క్లోజ్ అయినా వారు నాతో మాట్లాడానికి రావడం లేదు.. మా కౌన్సిలే దీన్ని పాయింట్ అవుట్ చేసింది.. తప్పు పడుతోంది అని నాటే.. దిల్ రాజు వారికి టార్గెట్.. ఎందుకంటే ఎదిగాడు కాబట్టి.. ఓర్వలేనితనం.. ఎదిగాడని ప్రాబ్లెమో.. నా చుట్టూ వివాదాలను పెట్టాలని ప్రాబ్లెమో.. వరుస సినిమాలు తీస్తున్నాను.. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, థియేటర్ లు ఉన్నాయి.. ఇవన్నీ చూసి ప్రాబ్లెమ్ క్రియేట్ చేస్తున్నారు. నా దృష్టిలో ఇసి అసలు ప్రాబ్లెమ్ కాదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెద్ద దుమారాన్నే రేపెలా ఉన్నాయని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.

Exit mobile version